అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ఈనెల 15న నామినేషన్ దాఖలు చేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుఽడు శంకరనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరతారని పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.