రేపటి హర్తాళ్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు | ysrcp support to tomorrow bundh | Sakshi
Sakshi News home page

రేపటి హర్తాళ్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు

Published Sat, Nov 26 2016 11:20 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

ysrcp support to tomorrow bundh

అనంతపురం : పెద్దనోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తీర్చడంలో ప్రభుత్వ వైఫల్యంపై  ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 28న తలపెట్టిన హర్తాళ్‌ (స్వచ్ఛంద బంద్‌)కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు  శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి వేర్వేరు ›ప్రకటనలు విడుదల చేశారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఎలాంటి చర్యలనైనా వైఎస్సార్‌సీపీ సమర్థిస్తుందని పేర్కొన్నారు.

అయితే.. ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేయకుండానే రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు, కార్మికులు, మహిళలు కొన్ని రోజులుగా  డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement