గోరంట్ల : జిల్లాలో వర్షాబావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బూచేపల్లి గ్రామంలో ఆయనSగురువారం విలేకరులతో మాట్లాడారు. గత రెండేళ్లు ప్రకృతి వైఫరీత్యాలతో పాటు ప్రభుత్వం వైఫల్యాల కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్డాడుతోందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రైతులు ఎంతో ఆశతో అప్పులు చేసి పంటను సాగు చేశారన్నారు.
అయితే ఆతర్వాత వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట ఎండిపోయిందన్నారు. పంట పెట్టుబడులు సైతం దక్కే అవకాశం లే దని రైతులు అందోళన చెందుతున్నారన్నారు. గ్రామాలలో ఏ రైతును కదిలించిన పంట నష్టంపై వాపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం రక్షక తడులను అందించినట్లు అంకెల గారడితో రైతులను మభ్యపెడుతోందని విమర్శించారు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రైతులతో రక్షక తడులను అందించినట్లు సంతకాలు, వివరాలను తీసుకోవడం జరుగుతోందన్నారు. గోరంట్ల మండలంలో 38311.18 ఎకరాల్లో పంట సాగు చేస్తే సుమారు 2 వేల ఎకరాలకు రక్షక తడులను అందించామని అధికారులు అంటున్న , క్షేత్రస్థాయిలో రైతులు అందలేదని అంటున్నారని ఆయన తెలిపారు.
వేరుశనగ సాగు చేసిన రైతులు నష్టపోయి ఏడాదికేడాది వలసలు వెళ్తున్నారని, దీంతో ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి వేరుశనగ రైతుకు పూర్తిస్థాయిలో కనీసం ఎకరాకు రూ. 20 వేల చొప్పున నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తే రైతాంగం తరుపున ఉద్యమాలు చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం ఇవ్వాలి
Published Fri, Sep 16 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
Advertisement
Advertisement