సోమందేపల్లి : ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల నీటి ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు లూటీ చేసిన అధికార పార్టీ నాయకులు తాజాగా జిల్లాలో కూడా నీటి ప్రాజెక్టులలో భారీగా అక్రమాలకు యత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. శుక్రవారం చాలకూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేరూరు, భైరవానితిప్ప ప్రాజెక్టులతో పాటు హంద్రీనీవా కోసం రూ.2,846 కోట్లు నిధులు అవసరమని అంచనాలు వేయడం వెనుక తెలుగు తమ్ముళ్లకు లబ్ధిచేకూర్చాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
రూ.500 కోట్లు ఖర్చు పెడితే పేరూరు, బీటీపీలకు నీళ్లు వస్తాయన్నారు. కానీ పట్టిసీమ తరహాలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అంచనాలు పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు. కరువు జిల్లాగా ఉన్న అనంతపురం జిల్లాలో ఈ విధంగా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడటం పద్ధతి కాదని హితవుపలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా రైతాంగం కోసం ప్రారంభించిన హంద్రీనీవాను టీడీపీ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
‘ప్రాజెక్టుల పేరిట ప్రజాధనం లూటీ’
Published Fri, Oct 28 2016 11:28 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement
Advertisement