‘ఉత్తుత్తి హామీలతో వంచించారు’ | gadapa gadapakoo ysr in penukonda | Sakshi
Sakshi News home page

‘ఉత్తుత్తి హామీలతో వంచించారు’

Published Sat, Aug 20 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

‘ఉత్తుత్తి హామీలతో వంచించారు’

‘ఉత్తుత్తి హామీలతో వంచించారు’

పెనుకొండ రూరల్‌ : చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ వంచనలేనని     గోనిపేట గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  మాలగుండ్ల శంకరనారాయణ వద్ద వాపోయారు. శుక్రవారం మండలంలోని గోనిపేట గ్రామంలో   శంకరనారాయణ గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు.  ‘ప్రభాకర్‌ అనే మతి స్థిమితం లేని వ్యక్తికి గతంలో రూ. 200 పింఛన్‌ వచ్చేది. టీడీపీ అధికారంలోకి రాగానే అతనికి పింఛన్‌ తొలగించార’ని స్థానికులు తెలిపారు.

అంతేకాకుండా పింఛన్లు, పక్కాగృహాలు, ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా రుణాలు తదితర సమస్యలను గ్రామస్తులు ఏకరవు పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, అనితాశ్రీనివాసరెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ నాగలూరుబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement