పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ | paritala-sriram-supporters-brutally-attack-a-man-in-rapthadu | Sakshi
Sakshi News home page

పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ

Published Sun, Oct 30 2016 1:47 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ - Sakshi

పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ

అనంతపురం: అనంతపురం జ్లిలాలో పరిటాల అనచరుల దౌర్జాన్యాలు మితిమీరిపోతున్నాయని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. రాప్తాడు నియోజక వర్గంలో ఆటవిక న్యాయం యథేచ్ఛగా జరుగుతోందన్నారు. పట్టపగలు ఓ వ్యక్తిపై అమానుషంగా ప్రవర్తించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. బోయ ఓబులేషు పై దాడికి పాల్పడ్డ పరిటాల అనుచరులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కాగా పరిటాల అనచరుల దౌర్జన్యాలు కలకలం రేపుతున్నాయి. రాప్తాడు లో బయటపడ్డ పరిటాల అనుచరుల దాడి దృశ్యాలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఈ ఘటనపై అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ విచారణ చేపట్టారు. ఓబులేషు పై దాడిని చూసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. 
 
మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు నగేష్‌చౌదరి యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబులేసు అనే యువకుడిపై శుక్రవారం మధ్యాహ్నం ఒళ్లు గగుర్పొడిచేలా సాగించిన దాష్టీకం వీడియో శనివారం బయటకు వచ్చింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత పదడుగుల గుంతలో పడిన ఓబులేసు బట్టలూడదీసి.. కిందపడేసి.. బెల్టుతోను.. చెప్పుకాలుతో కసితీరా చావబాదాడు. ముఖంపై పదేపదే తన్నాడు. క్షమించమని, వదిలేయమని ప్రాధేయపడుతున్నా వినకుండా విచక్షణారహితంగా దాడిచేయడం చూసి అటువైపు వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారమందించారు. దాదాపు గంటపాటు దాడి కొనసాగించినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement