hulchal in anantapur
-
ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్
-
బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పరిటాల శ్రీరామ్‌కు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన నగేష్ చౌదరి కాబోయే భార్య శ్రుతి మంగళవారం ఓబులేసుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత నాలుగేళ్లుగా ఓబులేసు వేధిస్తున్నాడని, ఆ విషయాన్ని చెప్పడం వల్లే నగేష్ చౌదరి దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఓబులేసుపై నాగేష్ చౌదరి దాడి చేసిన వీడియో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. గత అయిదు రోజులుగా ఓబులేసు ఆచూకీ కూడా లేదు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఈ నేపథ్యంలో నాగేష్ చౌదరి కాబోయే భార్య ఓబులేసుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ ఒత్తిళ్లతో నగేష్ చౌదరి, ఓబులేసు మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బోయ ఓబులేసును నగేష్ చౌదరి చితకబాదడంపై ‘సాక్షి’లో వార్తలు ప్రసారం కావడం, అతడి పుట్టినరోజుకు మంత్రి పరిటాల సునీత ఇద్దరు కుమారులు హాజరైన చిత్రాలనూ చూపించడంతో పరిటాల వర్గం ఆత్మరక్షణలో పడింది. అలాగే సిటీ కేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాలను ఆదివారం రాత్రి నుంచి నిలిపేశారు. -
‘అనంత’ లో కొనసాగుతున్న హైడ్రామా
-
‘అనంత’ లో కొనసాగుతున్న హైడ్రామా
అనంతపురం: అనంతపురం జిల్లాలో హైడ్రామా కొనసాగుతోంది. పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్ చౌదరీ రాప్తాడులో ఓబులేష్ అనే వ్యక్తిపై దాడి చేసిన వీడియో బయటకు వచ్చి కలకలం రేపింది. అప్పటి నుంచి ఓబులేషు ఆచూకీ తెలియడం లేదు. అయితే పోలీసులు రహస్యంగా ఓబులేషుకు చికిత్స అందిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో నగేష్ చౌదరి, ఓబులేషు మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ మొత్తం వ్యవహరం తీరును పలువురు తప్పుబడుతున్నారు. మంత్రి పరిటాల సునీత ఒత్తిడి మేరకే ఓబులేషు పై హత్యాయత్నం జరిగిందని పౌరహక్కుల సంఘం నేత, లాయర్ హరినాథ్ రెడ్డి ఆరోపించారు. ఐదు రోజుల నుంచి ఓబులేషు ఆచూకీ లభించకపోయినా పోలీసులు కిడ్నాప్ వంటి కేసులు నమోదు చేయలేదన్నారు. అనంత పోలీసులు బ్రోకర్లలా వ్యవహరించడం బాధాకరమని ఆయన మండిపడ్డారు. -
పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ
-
పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ
అనంతపురం: అనంతపురం జ్లిలాలో పరిటాల అనచరుల దౌర్జాన్యాలు మితిమీరిపోతున్నాయని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. రాప్తాడు నియోజక వర్గంలో ఆటవిక న్యాయం యథేచ్ఛగా జరుగుతోందన్నారు. పట్టపగలు ఓ వ్యక్తిపై అమానుషంగా ప్రవర్తించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. బోయ ఓబులేషు పై దాడికి పాల్పడ్డ పరిటాల అనుచరులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా పరిటాల అనచరుల దౌర్జన్యాలు కలకలం రేపుతున్నాయి. రాప్తాడు లో బయటపడ్డ పరిటాల అనుచరుల దాడి దృశ్యాలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఈ ఘటనపై అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ విచారణ చేపట్టారు. ఓబులేషు పై దాడిని చూసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్‌చౌదరి యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబులేసు అనే యువకుడిపై శుక్రవారం మధ్యాహ్నం ఒళ్లు గగుర్పొడిచేలా సాగించిన దాష్టీకం వీడియో శనివారం బయటకు వచ్చింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత పదడుగుల గుంతలో పడిన ఓబులేసు బట్టలూడదీసి.. కిందపడేసి.. బెల్టుతోను.. చెప్పుకాలుతో కసితీరా చావబాదాడు. ముఖంపై పదేపదే తన్నాడు. క్షమించమని, వదిలేయమని ప్రాధేయపడుతున్నా వినకుండా విచక్షణారహితంగా దాడిచేయడం చూసి అటువైపు వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారమందించారు. దాదాపు గంటపాటు దాడి కొనసాగించినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. -
దాష్టీకం
= గొడ్డును బాదినట్లు బాదారు = గంటకుపైగా విచక్షణారహితంగా దాడి = కలకలం సృషి్టంచిన పరిటాల శ్రీరామ్ అనుచరుని వీరంగం వీడియో = ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్‌చౌదరి యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబులేసు అనే యువకుడిపై శుక్రవారం మధ్యాహ్నం ఒళ్లు గగుర్పొడిచేలా సాగించిన దాషీ్టకం వీడియో శనివారం బయటకు వచ్చింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత పదడుగుల గుంతలో పడిన ఓబులేసు బట్టలూడదీసి.. కిందపడేసి.. బెల్టుతోను.. చెప్పుకాలుతో కసితీరా చావబాదాడు. ముఖంపై పదేపదే తన్నాడు. క్షమించమని, వదిలేయమని ప్రాధేయపడుతున్నా వినకుండా విచక్షణారహితంగా దాడిచేయడం చూసి అటువైపు వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారమందించారు. దాదాపు గంటపాటు దాడి కొనసాగించినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. కాళ్లు పట్టుకుంటా.. కాపాడండి సార్ : ఘటనా స్థలంలో బాధితుడు ఓబులేసు ఆర్తనాదాలు మిన్నంటాయి. చెప్పుకాలుతో ముఖంపై తన్నడంతో తీవ్రంగా గాయపడిన అతను పోలీసులు వచ్చిన తర్వాత ‘సార్ మీ కాళ్లు పట్టుకుంటా కాపాడండి’ అంటూ ప్రా«ధేయపడ్డాడు. కానీ నగేష్చౌదరిలో ఏమాత్రం బెరుకు కనిపించలేదు. మరింత రెచ్చిపోయి చితకబాదాడు. పైగా శ్రీరామ్ మేనమామ రాజన్నతో మాట్లాడాలని సదరు కానిస్టేబుళ్లకు ఫోన్ కలిపి ఇవ్వడం చర్చనీయాంశం అయింది. పోలీసుల సమక్షంలో కొడుతున్నా వారు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. దాడి చేసిన వ్యక్తిని వదిలిపెట్టి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితుడి వివరాలను పోలీసులు ఆరా తీయడం విమర్శలకు తావిచ్చింది. ‘ఏ ఊర్రా నీది..? మీ నాయనపేరు ఏమిటి’ అని ఆరా తీశారు. అంతకు ముందు నగేష్ చౌదరి... ‘ఈ పొద్దంత పోలీసులు రారు. ఎస్ఐ వచ్చినా ఏమీ చేయరు. ఆటో తీసుకురండిరా... వీన్ని ఎత్తుకుపోవాలి’ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. అజ్ఞాతంలో బాధితుడు.. దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు ఆపకుండా ప్రేక్షకపాత్ర పోషించడం వివాదాస్పదమైంది. తాపీగా క్షతగాత్రుడిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించి.. దాడిచేసిన నగేష్‌చౌదరిని ఇటుకలపల్లి పోలీస్‌స్టేçÙన్కు తరలించినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలం రాప్తాడు స్టేషన్పరిధిలోకి వస్తుండడంతో తిరిగి నగేష్‌చౌదరిని రాప్తాడు పోలీస్‌స్టేçÙన్కు తీసుకొచ్చారు. కాగా ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం వరకూ చికిత్స పొందుతున్న ఓబులేసు ప్రస్తుతం కనిపించడం లేదు. పరిటాల వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందనుకున్నాడో, ఏమో తెలియదు కానీ అజ్ఞాతంలోకి వెళ్లి్లపోయాడు. ఇప్పటి వరకూ బాధితుని కుటుంబ సభ్యులు కూడా బయటకు రాలేదు. నిందితుడికి రాచమర్యాదలు .. యువకుడిని గొడ్డును బాదినట్లు బాదిన నగేష్‌చౌదరికి పోలీస్‌స్టేçÙన్లో రాచమర్యాదలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం గంటసేపు కూ డా సెల్లో వేయకుండా అక్కడి నుంచి పంపించేసినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ శనివారం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో పోలీసులు కంగుతిన్నారు. మళ్ళీ ఆగమేఘాల మీద నగేష్‌చౌదరిని స్టేషన్‌కు పిలిపించారు. సెక్షన్ 341, 324 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పటికీ అతనికి రాచమర్యాదలు అందుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. -
పరిటాల అనుచరుడి వీరంగం
అనంతపురం సెంట్రల్ : పరిటాల అనుచరులు వీరంగం చేశారు. బైక్‌పై వెళుతున్న యువకుడిని మరో బైక్‌తో ఢీకొట్టి... బురదగంటలో అరగంటపాటు ఏకధాటిగా చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబిలేసు అనే యువకుడు రాప్తాడు మండలం బండమీదపల్లిలో శుక్రవారం మొహర్రం వేడుకలు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరాడు. పండమేరు వంక వద్దకు రాగానే అక్కడ కాపుకాచిన మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసే నగేష్‌చౌదరి కొంతమంది అనుచరులతో అటకాయించారు. వేగంగా ఒక బైక్‌తో ఢీకొట్టించడంతో ఓబులేసు పది అడుగుల గుంతలోకి బైక్‌తో సహా కిందపడ్డాడు. అప్పటికీ వదలకుండా బురదగుంటలో పడేసికొట్టారు. అడ్డొచ్చిన వ్యక్తులపై ‘తాను పరిటాల శ్రీరామ్ వ్యక్తిని.. వెల్లిపోండి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అరగంటపాటు అటువైపు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. నగేష్‌చౌదరికి చెన్నేకొత్తపల్లిలో వివాహం నిశ్చయమైంది. ఈ విషయంలో ఓబులేసుతో మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. ఇది మనసులో పెట్టుకునే ఇలా చేశాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడిలో గాయపడిన ఓబులేసును అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. నిందితుడిని తొలుత ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు రాప్తాడు పోలీసులు ధ్రువీకరించలేదు.