అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పరిటాల శ్రీరామ్‌కు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన నగేష్ చౌదరి కాబోయే భార్య శ్రుతి మంగళవారం ఓబులేసుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత నాలుగేళ్లుగా ఓబులేసు వేధిస్తున్నాడని, ఆ విషయాన్ని చెప్పడం వల్లే నగేష్ చౌదరి దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఓబులేసుపై నాగేష్ చౌదరి దాడి చేసిన వీడియో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.