రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై కిరాతకంగా దాడికి దిగారు. పరిటాల శ్రీరామ్ డ్రైవర్ నగేష్ చౌదరికి కాబోయే భార్యను వేధించాడని ఆరోపిస్తూ పరిటాల అనుచరులు ఓబులేష్ ని చుట్టుముట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు, స్థానికుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా అందరూ మౌనం వహించారు తప్ప ఆపడానికి ప్రయత్నించలేదు.