దాష్టీకం | paritala gang hulchal in anantapur | Sakshi
Sakshi News home page

దాష్టీకం

Published Sun, Oct 30 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

paritala gang hulchal in anantapur

= గొడ్డును బాదినట్లు బాదారు
= గంటకుపైగా విచక్షణారహితంగా దాడి
= కలకలం సృషి్టంచిన పరిటాల శ్రీరామ్‌ అనుచరుని వీరంగం వీడియో
= ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు


అనంతపురం సెంట్రల్‌ : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు నగేష్‌చౌదరి యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబులేసు అనే యువకుడిపై శుక్రవారం మధ్యాహ్నం ఒళ్లు గగుర్పొడిచేలా సాగించిన దాషీ్టకం వీడియో శనివారం బయటకు వచ్చింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత పదడుగుల గుంతలో పడిన ఓబులేసు బట్టలూడదీసి.. కిందపడేసి.. బెల్టుతోను.. చెప్పుకాలుతో కసితీరా చావబాదాడు. ముఖంపై పదేపదే తన్నాడు. క్షమించమని, వదిలేయమని ప్రాధేయపడుతున్నా వినకుండా విచక్షణారహితంగా దాడిచేయడం చూసి అటువైపు వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారమందించారు. దాదాపు గంటపాటు దాడి కొనసాగించినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.

కాళ్లు పట్టుకుంటా.. కాపాడండి సార్‌ :
ఘటనా స్థలంలో బాధితుడు ఓబులేసు ఆర్తనాదాలు మిన్నంటాయి. చెప్పుకాలుతో ముఖంపై తన్నడంతో తీవ్రంగా గాయపడిన అతను పోలీసులు వచ్చిన తర్వాత ‘సార్‌ మీ కాళ్లు పట్టుకుంటా కాపాడండి’ అంటూ ప్రా«ధేయపడ్డాడు. కానీ నగేష్‌చౌదరిలో ఏమాత్రం బెరుకు కనిపించలేదు. మరింత రెచ్చిపోయి చితకబాదాడు. పైగా శ్రీరామ్‌ మేనమామ రాజన్నతో మాట్లాడాలని సదరు కానిస్టేబుళ్లకు ఫోన్‌ కలిపి ఇవ్వడం చర్చనీయాంశం అయింది. పోలీసుల సమక్షంలో కొడుతున్నా వారు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. దాడి చేసిన వ్యక్తిని వదిలిపెట్టి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న  బాధితుడి వివరాలను పోలీసులు ఆరా తీయడం విమర్శలకు తావిచ్చింది. ‘ఏ ఊర్రా నీది..? మీ నాయనపేరు ఏమిటి’ అని ఆరా తీశారు. అంతకు ముందు నగేష్‌ చౌదరి... ‘ఈ పొద్దంత పోలీసులు రారు. ఎస్‌ఐ వచ్చినా ఏమీ చేయరు. ఆటో తీసుకురండిరా... వీన్ని ఎత్తుకుపోవాలి’ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

అజ్ఞాతంలో బాధితుడు.. దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు ఆపకుండా ప్రేక్షకపాత్ర పోషించడం వివాదాస్పదమైంది. తాపీగా క్షతగాత్రుడిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించి.. దాడిచేసిన నగేష్‌చౌదరిని ఇటుకలపల్లి పోలీస్‌స్టేçÙన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలం రాప్తాడు స్టేషన్‌పరిధిలోకి వస్తుండడంతో తిరిగి నగేష్‌చౌదరిని రాప్తాడు పోలీస్‌స్టేçÙన్‌కు తీసుకొచ్చారు. కాగా ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం వరకూ చికిత్స పొందుతున్న ఓబులేసు ప్రస్తుతం కనిపించడం లేదు. పరిటాల వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందనుకున్నాడో, ఏమో తెలియదు కానీ అజ్ఞాతంలోకి వెళ్లి్లపోయాడు. ఇప్పటి వరకూ బాధితుని కుటుంబ సభ్యులు కూడా బయటకు రాలేదు.

నిందితుడికి రాచమర్యాదలు .. యువకుడిని గొడ్డును బాదినట్లు బాదిన నగేష్‌చౌదరికి పోలీస్‌స్టేçÙన్‌లో రాచమర్యాదలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం గంటసేపు కూ డా సెల్‌లో వేయకుండా అక్కడి నుంచి పంపించేసినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ శనివారం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో పోలీసులు కంగుతిన్నారు. మళ్ళీ ఆగమేఘాల మీద నగేష్‌చౌదరిని స్టేషన్‌కు పిలిపించారు. సెక్షన్‌ 341, 324 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పటికీ అతనికి రాచమర్యాదలు అందుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement