అనంతపురం: అనంతపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత ఈ 29న రాష్టవ్యాప్తంగా చేపట్టనున్న బంద్ను భగ్నం చేయాలని ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్కు రావాలంటూ వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణకు పోలీసులు ఫోన్ చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్ సీపీ రేపు చేపట్టనున్న బంద్ను నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారంటూ శంకర్ నారాయణ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ చేపట్టనున్న బంద్ను అడ్డుకుంటే టీడీపీ చరిత్ర హీనులుగా మిగులుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.