మెడికల్ రిప్‌లకు గుర్తింపుకార్డులివ్వాలి
మెడికల్ రిప్‌లకు గుర్తింపుకార్డులివ్వాలి
Published Mon, Aug 8 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
ఏలూరు(సెంట్రల్) : మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సీఐటీయూ నాయకుడు పి.కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.దక్షిణమూర్తి మాట్లాడుతూ మెడికల్ రిప్‌లు ప్రజల రోగాల నివృత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారిని అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులుగా గుర్తించి వారికి కార్మిక శాఖ గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. అలానే కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు వారికి వేజ్‌బోర్డును ఏర్పాటు చేసి, సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల చట్టాలను యాజమాన్యాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షకు సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ సంఘలతో పాటు పలువురు డాక్టర్లు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘం నాయకులు వీవీవీఎన్ ప్రసాద్, ఎల్.మోహన్‌మురళీ, ఎ.మహేష్‌కుమార్, జి.ఫణేంద్ర, పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement