
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవాలని సీపీఐ సీనియర్ నేత డి. రాజా వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలకు రాజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్‌ను ఆయన పరామర్శించారు. ప్రధాని మోదీ, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చర్యలను ఆయన ఖండించారు.
తమ పోరాటానికి మద్దతు తెలిపిన రాజాకు కేజ్రీవాల్ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘ధన్యావాదాలు కామ్రేడ్ రాజా’ అంటూ ట్వీట్ చేశారు. కాగా దేశ రాజధానిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో ముఖ్యమంత్రి కూర్చుని ధర్నా చేయడమేంటని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేజ్రీవాల్‌పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment