గ్రీవెన్స్ హాలును ప్రారంభించిన చంద్రబాబునాయుడు
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం తెల్లవారుజామున శంకుస్థాపన చేశారు. ఉదయం 5.17 నిమిషాలకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఉండవల్లి సమీపంలో ముఖ్యమంత్రి నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాలును కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ విభాగం అధ్యక్షుడు రమణ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువాళ్లు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తుందని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే ఏకైక పార్టీ టీడీపీనే అని పేర్కొన్నారు. కార్యాలయంలో నిత్యం భోజన వసతి కల్పించడం ఆనవాయితీ అని, దీని కోసం ఫిక్స్‌డ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలన్నారు. కార్యాలయాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిద్వారా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment