సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నేర దర్యాప్తు విభాగం(CID) నోటీసులు జారీ చేసింది. పార్టీ అకౌంట్‌లో జమ అయిన నగదు వివరాల్ని కోరుతూ సీఐడీ ఆ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ మేరకు టీడీపీ జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ పేరిట సీఐడీ ఆ నోటీసుల్ని జారీ అయినట్లు సమాచారం. పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ ఆ ఇద్దరికి నోటీసుల్లో సీఐడీ సూచించింది.
ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లిందనే అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ, ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది కూడా. అంతేకాదు.. ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను విచారించాల్సిన అవసరమూ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment