
28ఎంకేఎల్ 501: మద్దూరులో ఆర్ధనగ్నంగా నిరసన తెలుపుతున్న పంచాయతీ కార్మికులు
మద్దూరు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శనివారానికి ఆరో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు పంచాయతీ ఉద్యోగులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించానలి ఐఎఫ్‌టీయూ, సీపీఐ నాయకులు భీమేష్, హన్మంతు డిమాండ్ చేశారు. ఆరు రోజులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం శోఛనీయమని అన్నారు.
కనీస వేతన చట్టం ప్రకారం రూ.18వేలకు తగ్గకుండా వేతనం పెంచాలన్నారు. వీరి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వీరికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ ఉద్యోగ, కార్మికులు ఆంజనేయులు, వెంకటేష్, అంజయ్య, ఉసేన్ప పాల్గొన్నారు.