secuerity
-
ప్రమాద సమయంలో సాయి తేజ్‌కు సాయం చేసింది ఈ ఇద్దరే
సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందని తేజ్‌కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యులు తెలిపిన విషయం విధితమే. గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే సాయి తేజ్ ప్రాణాలతో బయటపడ్డారన్నారు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అంతేగాక ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌కి ఫిట్స్ రాగా, వెంటనే స్పందించిన వైద్యులు అతనికి ఇంజెక్షన్లు ఇవ్వటంతో.. తదుపరి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మెడికోవర్ వైద్యులు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్ వాడిన బైక్ ఏంటి? ధర ఎంత? అయితే శుక్రవారం సాయంత్రం కెబుల్ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు వెళ్తుండగా సాయి ఈ ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108కు కాల్ చేసి తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడటంలో కీలక పాత్ర పోషించిన ఎవరో తెలుసా! ఆ అతడు ఓ సెక్యూరిటీగార్డ్. పేరు అబ్దుల్. అమీర్‌పెట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్ నిజాంపేట క్రాస్‌రోడ్డులో కొత్తగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్లో వ్యాలెట్ పార్కింగ్ చేస్తుంటాడట. చదవండి: ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్ భావోద్వేగం ఈ క్రమంలో శుక్రవారం విధులకు కెబుల్ బ్రిడ్జ్ మీదుగా హైటెక్ సిటీ మార్గం గుండా బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో ఐకియా సమీపంలో సాయి ప్రమాదవశాత్తూ కిందపడటంతో అది చూసిన అబ్దుల్ వెంటనే బండి పక్కన ఆపి హుటాహుటిన సాయి దగ్గరకు వెళ్లాడు. ఆ వెంటనే 108, 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. 10 నిమిషాల్లో అంబులెన్స్ రావడం దగ్గర్లోని మెడికోవర్ ఆస్పత్రికి తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే అబ్దుల్ అంబులెన్స్‌లో సాయితో పాటు ఆస్పత్రికి కూడా వెళ్లినట్లు సమాచారం. చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్ అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతానికి కాస్త దూరంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా సకాలంలో స్పందించాడు. సమాచారం అందిన వెంటనే.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం.. అంబులెన్సు సకాలంలో ఆసుపత్రికి చేరటంలో సాయం చేశారు. అంబులెన్సులో మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పుడు మాత్రమే అతను హీరో సాయి తేజ్ అని అతడికి తెలిసిందట. ఏదేమైన వారు సకాలంలో స్పందించడం వలనే ఈ రోజు సాయి తేజ్ సేఫ్‌గా బయటపడ్డాడు. -
సైఫ్ అలీఖాన్ ఇంటికి భద్రత పెంపు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను మరింత పెంచారు. ఆయన నటించిన తాజా వెబ్ సిరీస్ ‘తాండవ్’పై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఆయన ఇంటిముందు పోలీసులు సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు. అయితే సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా ప్రస్తుతం గర్భవతిగా ఉన్న నేపథ్యంలో వారు కొత్త ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘తాండవ్’ వెబ్ సిరీస్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాండవ్‌ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ తాండవ్’, ‘బ్యాన్ తాండవ్’ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా వైరల్ చేస్తున్నారు. ‘తాండవ్’లో హిందూ దేవుళ్లను కించపరిచారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. (చదవండి: తాండవ్‌ను బ్యాన్ చేయాలి: బీజేపీ ఎంపీ) అంతేగాక వెబ్ సిరీస్ ప్రదర్శనను నిలిపివేయాలంటూ బీజేపీ ఎంపీ మనోజ్ కుమార్ కొటక్ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ సిరీస్ దేవుళ్లను ఎగతాళి చేయడం, సెక్స్, హింస, మాదక ద్రవ్యాల వాడకంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాండవ్‌లో సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్ పోషించారు. ఈ పోలీటికల్ డ్రామా వెబ్ సిరీస్‌ను దర్శకుడు అలీ అబ్బాస్ రూపొందించగా, హిమాన్షు కిశన్ మెహ్రాతో కలిసి నిర్మించారు. ఇందులో డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, తిగ్మన్షు ధులియా, గౌహర్ ఖాన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. -
నిఘాపై నీలినీడలు!
మహబూబ్‌నగర్ క్రైం : ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కలెక్టరేట్లో వాహనం పెడితే భద్రంగా ఉంటుందని భావించి తన బైక్‌ను కలెక్టరేట్లో పెట్టి డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రాంతంలో బైక్ లేదు. చివరకు అంతట గాలించిన దొరకలేదు చివరకు ఎవరో అపహరించారని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఒక్కటే కాదు పట్టణంలో బైక్ దొంగతనాల దగ్గర నుంచి ఇళ్ల చోరీల వరకు ప్రతి ఒక్కటి దోచుకొని దర్జాగా వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల అడ్డుకట్టకు చర్యలు కరవవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. వాటి సాయంతో నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో అధికారులు తత్సారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల సంఖ్య ఎక్కువగా నమోదైన సందర్భాలున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆకతాయిలు ఆగడాలు సృష్టిస్తూ పోలీసులకు చిక్కకుండాపోతున్నారు. మహిళలపై జరిగే ఎన్నో వేధింపులు వెలుగులోకి రాకుండా పొతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు నిఘా కెమెరాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. ప్రతి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సైతం సూచిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అవి అందుబాటులో రావడం లేదు. జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిని, దొంగతనాలకు పాల్పడిన వారి గుర్తించి సొమ్ములను రికవరీ చేసిన కొన్ని సందర్భాలున్నాయి. కెమెరాల ఏర్పాటులో జాప్యం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి ఎదుట, అవంతి హోటల్ సమీపంలో, న్యూటౌన్ పంచవటి హోటల్ నుంచి సుభాష్ చంద్రభోస్ విగ్రహాం వరకు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాల ఎదుట, బస్టాండ్‌లో, కలెక్టరెట్లో, అంబేద్కర్ చౌరస్తాలో, తెలంగాణ చౌరస్తాలో, పాత బస్టాండ్‌లో, క్లాక్‌టవర్, ఆకుల చౌరస్తా, వన్‌టౌన్ ప్రాంతాల్లో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. బండమీదిపల్లి శివారు, కోయిలకొండ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సైతం తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. వితరణ కోసం వెంపర్లాట జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. భద్రతా చర్యల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యంగా పోలీసులు భావిస్తున్నా వితరణ కోసం వెంపర్లాడుతున్నారు. పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ముందుకొస్తే వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశాలుంటాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపిక చేసిన ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నామంటున్నారు. పోలీసుల సూచనల మేరకు వ్యాపారుల ఎవరికి వారు దుకాణాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు అవకాశం లేకుండాపోతుంది. -
ఎయిర్‌పోర్టుల భద్రతకు సోషల్ మీడియా
న్యూఢిల్లీ: దేశంలోని ఎయిర్‌పోర్టులు, అణువిద్యుత్, అంతరిక్ష కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణ, పటిష్టానికి తొలిసారిగా సోషల్ మీడియా సమాచారాన్ని వినియోగించబోతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు రక్షణ కల్పిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం(సీఐఎస్ఎఫ్) చెన్నై సమీపంలోని అరక్కోణం వద్ద సోషల్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శిక్షణ పొందిన సీఐఎస్ఎఫ్ ప్రతినిధులు సోషల్ మీడియా ట్రెండ్స్, వార్తలు, నివేదికలు, ఇతర సమాచారాన్ని సమన్వయపరిచి ఎయిర్‌పోర్టులు, ఇతర కీలక సంస్థలకు వాటిని ఎప్పటికప్పుడు చేరవేస్తారు. ఇందుకోసం ట్వీటర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఫ్లికర్ల సేవల్ని వాడుకోనున్నారు. -
ఆటో వర్కర్ల నిరసన
విజయవాడ (రైల్వేస్టేషన్) : పుష్కరాల భద్రత పేరిట తమ పొట్టకొట్టవద్దని సీఐటీయూ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ దుర్గావలి వేడుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆటో కార్మికులు ఆదివారం రైల్వేఇనిస్టిట్యూట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. దుర్గావలి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీ దృష్ట్యా తూర్పు ముఖద్వారం వద్ద ఉన్న ఆటోస్టాండ్‌ను రైల్వేఇనిస్టిట్యూట్కు మార్చాలని రైల్వే అధికారులు, పోలీస్ అధికారులు కోరగా తాము అంగీకరించామని గుర్తుచేశారు. ట్రాఫిక్ పేరిట ట్రాఫిక్ పోలీసులు ఆదివారం తమ ఆటోస్టాండ్‌ను తక్షణమే తరలించాలని ఆదేశించారని, ఇప్పటికే అంతమాత్రంగా ఉన్న తమ ఉపాధికి గండి పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సెంట్రల్ ఏసీపీ సౌమ్యలత నుంచి ఇప్పటికే ఇనిస్టిట్యూట్ వద్ద ఆటోలు నిలుపుటకు అనుమతి తీసుకున్నామని, అయినా ట్రాఫిక్ పోలీసులు ఆటోస్టాండు తరలించమనడం దారుణమని పేర్కొన్నారు. -
మూడు మునకలే..!
ఇంద్రకీలాద్రి : పుష్కర స్నానానికి విచ్చేసే భక్తుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. తొలి రోజున పద్మావతి ఘాట్‌లో బాలుడు నీట మునిగి మృతి చెందడంతో రెండో రోజు నుంచి బందోబస్తు కట్టుదిట్టం చేశారు ప్రతి స్నాన ఘాట్‌లో స్నానాలు చేసే భక్తులను వెయ్యి కళ్లతో పహారా కాసేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. నదిలో మూడు మునకలే అన్నట్లుగా ఎక్కువ సేపు ఎవరికి నదిలో ఉండనీయడం లేదు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు స్నానానికి దిగే సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారిని వెయ్యి కళ్లతో పరిశీలిస్తూ ప్రతి క్షణం విజిల్స్ ఊదుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి కంటే శనివారం నదిలో నీటిమట్టం సుమారు ఒక అడుగు మేర పెరగడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నదిలో బ్యారికేడ్ వరకు ఎవరిని అనుమతించడం లేదు. ముఖ్యంగా నీటితో ఆటలాడే యువతి, యువకులను వెళ్లకుండా చూస్తున్నారు. -
మహిళలకు రక్షణ కరువు
గన్నవరం : రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించినా, పాలకులు తారతమ్యాలు చూపిస్తూ మహిళలకు విలువ లేకుండా చేస్తున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. పురుషులతో సమానంగా రాణిస్తునప్పటికీ మహిళలకు రక్షణ కొరవడిందన్నారు. స్థానిక శ్రీమల్లికార్జున హైస్కూల్లో రెండురోజులు నిర్వహించే ఐద్వా రాష్ట్ర స్తృత స్థాయి సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సంఘ పతాకాన్ని ఐద్వా సీనియర్ నాయకురాలు యర్లగడ్డ జోయా ఆవిష్కరించారు. సంఘ వ్యవస్థాపకురాలు మానికొండ సూర్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రమాదేవి మాట్లాడుతూ మహిళా చట్టాలను పాలకులు నీరుగారుస్తూ, రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్త్రీ, పురుషుల నిష్పత్తిని సమానం చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుధాసుందర్రామన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, మాధవి, లక్ష్మి, శ్రీదేవి, జిల్లా కార్యదర్శి పిన్నమనేని విజయ, డివిజన్ కార్యదర్శి మల్లంపల్లి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.