న్యూఢిల్లీ: దేశంలోని ఎయిర్‌పోర్టులు, అణువిద్యుత్, అంతరిక్ష కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణ, పటిష్టానికి తొలిసారిగా సోషల్ మీడియా సమాచారాన్ని వినియోగించబోతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు రక్షణ కల్పిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం(సీఐఎస్‌ఎఫ్) చెన్నై సమీపంలోని అరక్కోణం వద్ద సోషల్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
శిక్షణ పొందిన సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు సోషల్ మీడియా ట్రెండ్స్, వార్తలు, నివేదికలు, ఇతర సమాచారాన్ని సమన్వయపరిచి ఎయిర్‌పోర్టులు, ఇతర కీలక సంస్థలకు వాటిని ఎప్పటికప్పుడు చేరవేస్తారు. ఇందుకోసం ట్వీటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఫ్లికర్‌ల సేవల్ని వాడుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment