ఇష్టానుసారంగా యాత్రికుల లగేజీ
ఇష్టానుసారంగా యాత్రికుల లగేజీ
Published Tue, Aug 16 2016 8:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
విజయవాడ(ఇంద్రకీలాద్రి):
క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్‌లలో భద్రత డొల్లేనని మరోమారు రుజువైంది. యాత్రికుల రద్దీ ఎక్కువ కావడంతో రెండు రోజులుగా చెప్పులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దుర్గగుడి అధికారులు యాత్రికుల లగేజీ, చెప్పులను భద్రపరుచుకుందుకు చైనావాల్ వద్ద మంగళవారం నుంచి క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆయా స్టాండ్‌లలో సిబ్బందిని నియమించడం మరిచారు. రాక్‌లు అందుబాటులో ఉండటంతో యాత్రికులు తమ లగేజీని అక్కడే పెట్టి అమ్మవారి దర్శనానికి Ðð ళ్లారు. తిరిగి వచ్చే సరికి లగేజీ పెట్టిన ప్రాంతం అంతా చిందర వందరగా పడి ఉంది. బ్యాగులలో సామగ్రి ఎలా ఉన్నాయనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికులకు సరైన సదుపాయాలు కల్పించడంలో దుర్గగుడి అధికారులు వైఫల్యం చెందారని పలువురు భక్తులు విమర్శించారు. ఇక యాత్రికుల చెప్పులు వందల సంఖ్యలోనే కనిపించలేదని వాలంటర్లు, పోలీసులు సిబ్బంది పేర్కొన్నారు.
Advertisement