luggage problems
-
భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!
భారత హాకీ స్టార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాణి రాంపాల్‌కు ఇటీవల విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేపుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపింది.వివరాల్లోకి వెళితే..రాణి రాంపాల్ ఇటీవల ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి ఇండియా తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యాక తన లగేజీ తీసుకుందామని వెళ్లేసరికి ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తన లగేజీ బ్యాగ్ పగిలి ఉండడం గమనించారు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిరిండియా పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ఎయిర్‌లైన్‌కు వ్యతిరేకంగా తన ఆందోళనను తెలియజేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ పంచుకున్నారు.Thank you Air India for this wonderful surprise. This is how your staff treat our bags. On my way back from Canada to India this afternoon after landing in Delhi I found my bag broken.@airindia pic.twitter.com/xoBHBs0xBG— Rani Rampal (@imranirampal) October 5, 2024‘ఎయిర్ ఇండియా, మీరిచ్చిన అద్భుతమైన సర్వీసుకు ధన్యవాదాలు. మీ సిబ్బంది మా లగేజీని ఇలా భద్రపరుస్తున్నారు. ఇటీవల కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా, ఢిల్లీలో దిగిన తర్వాత నా బ్యాగ్ ఈ స్థితిలో కనిపించింది’ అని పోస్ట్ చేశారు. అదికాస్తా ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎయిరిండియా వెంటనే స్పందించింది. ‘ప్రియమైన రాంపాల్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మీ టిక్కెట్ వివరాలు, బ్యాగ్ ట్యాగ్ నంబర్, ఫిర్యాదు నంబర్/డీబీఆర్ కాపీని పంపించండి. వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటాం’ అని ఎయిరిండియా తెలిపింది.ఇదీ చదవండి: పేరుకు స్మాల్ క్యాప్.. ఆ సంస్థల్లో పెట్టుబడెందుకు?ఎయిర్‌లైన్ కంపెనీలు టికెట్ ధరలు పెంచడం, తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తున్నామని ప్రకటనలు చేయడంపై ఉన్న శ్రద్ధ ఆ సర్వీసులు అందించడంలో లేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా విమానయాన సంస్థలు స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు. -
దుబాయికి ఈ సామగ్రి తీసుకెళ్లడం నిషేధం
గల్ఫ్ డెస్క్: దుబాయి ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణించేవారు తమ లగేజీలో కొన్ని రకాల వస్తువులను తీసుకపోవడంపై అక్కడి పోలీసులు నిషేధం విధించారు. ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ.. తాము నిషేధించిన సామగ్రి వివరాలను దుబాయి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. స్మార్ట్ బ్యాలెన్స్ వీల్స్(హోవర్ బోర్డ్స్ అని కూడా పిలుస్తారు), రసాయనాలు(కెమికల్స్), మెటాలిక్ ఐటెమ్స్ (పెద్ద సైజు కలిగినవి), కార్ల స్పేర్ పార్ట్స్, అన్ని రకాల గ్యాస్ సిలిండర్లు, బ్యాటరీలు, టార్చ్లైట్లు, పేలుడుకు సంబంధించిన లిక్విడ్లు, అలాగే పేలుడుతో సంబంధం లేకున్నా అధిక మోతాదులో ఉన్న లిక్విడ్లు, ఇ సిగరెట్స్, పవర్ బ్యాంక్స్‌ను లగేజీల్లో తీసుకెళ్లడం నిషేధం. -
వీడి అతి తెలివికి నెటిజన్లు ఫిదా..
ఎడిన్బర్గ్ : విమానంలో అదనపు లగేజీ చార్జీల నుంచి తప్పించుకోవడానికి మంచేస్టర్ మహిళ చేసిన పనిని నెటిజన్లు ఇప్పటికి మర్చిపోలేదు. సదరు మహిళ లగేజ్ చార్జీ తప్పించుకోవడం కోసం ఒకదానిమీద ఒకటి ఏడు డ్రెస్సులు, రెండు చొక్కాలు ధరించి విమానాశ్రయ సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా సదరు మహిళను స్ఫూర్తిగా తీసుకున్నాడేమో.. అతను కూడా అలానే చేశాడు. లగేజీ చార్జీలు తప్పించుకునేందుకు ఈ వ్యక్తి ఏకంగా 15 టీ షర్ట్స్‌ను ఒక దాని మీద ఒకటి ధరించాడు. వివరాలు.. గ్లాస్గోకు చెందిన జాన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఎడిన్బర్గ్ వెళ్తున్నాడు. అయితే విమానాశ్రయ నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ వెంట 8కిలోల కన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్లకూడదు. అలా చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో జాన్ లగేజీ 8కిలోల కంటే ఎక్కువగానే ఉంది. దాంతో అతను లగేజీ చార్జీ తప్పించుకోవడం కోసం బ్యాగులో నుంచి టీ షర్టులు తీసి ఒక దాని మీద ఒకటి ధరించడం ప్రారంభించాడు. ఇలా మొత్తం 15 టీ షర్ట్స్ ధరించాడు. అయితే ఈ మొత్తం తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరలవుతోది. Suitcase was over the weight limit in the airport so ma Da whipped oot aboot 15 shirts n wacked every one a them on to make the weight🤣🤣🤣😂😂cunt wis sweatin pic.twitter.com/7h7FBgrt03 — Josh Irvine (@joshirvine7) July 6, 2019 -
ఇష్టానుసారంగా యాత్రికుల లగేజీ
విజయవాడ(ఇంద్రకీలాద్రి): క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్లలో భద్రత డొల్లేనని మరోమారు రుజువైంది. యాత్రికుల రద్దీ ఎక్కువ కావడంతో రెండు రోజులుగా చెప్పులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దుర్గగుడి అధికారులు యాత్రికుల లగేజీ, చెప్పులను భద్రపరుచుకుందుకు చైనావాల్ వద్ద మంగళవారం నుంచి క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆయా స్టాండ్లలో సిబ్బందిని నియమించడం మరిచారు. రాక్లు అందుబాటులో ఉండటంతో యాత్రికులు తమ లగేజీని అక్కడే పెట్టి అమ్మవారి దర్శనానికి Ðð ళ్లారు. తిరిగి వచ్చే సరికి లగేజీ పెట్టిన ప్రాంతం అంతా చిందర వందరగా పడి ఉంది. బ్యాగులలో సామగ్రి ఎలా ఉన్నాయనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికులకు సరైన సదుపాయాలు కల్పించడంలో దుర్గగుడి అధికారులు వైఫల్యం చెందారని పలువురు భక్తులు విమర్శించారు. ఇక యాత్రికుల చెప్పులు వందల సంఖ్యలోనే కనిపించలేదని వాలంటర్లు, పోలీసులు సిబ్బంది పేర్కొన్నారు.