భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం! | bad experience faced by rani rampal in airindia | Sakshi
Sakshi News home page

భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!

Published Mon, Oct 7 2024 10:28 AM | Last Updated on Mon, Oct 7 2024 11:38 AM

bad experience faced by rani rampal in airindia

భారత హాకీ స్టార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాణి రాంపాల్‌కు ఇటీవల విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. అది‌కాస్తా వైరల్‌గా మారింది. ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేపుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపింది.

వివరాల్లోకి వెళితే..రాణి రాంపాల్‌ ఇటీవల ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి ఇండియా తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యాక తన లగేజీ తీసుకుందామని వెళ్లేసరికి ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తన లగేజీ బ్యాగ్‌ పగిలి ఉండడం గమనించారు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిరిండియా పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ఎయిర్‌లైన్‌కు వ్యతిరేకంగా తన ఆందోళనను తెలియజేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పంచుకున్నారు.

‘ఎయిర్ ఇండియా, మీరిచ్చిన అద్భుతమైన సర్వీసుకు ధన్యవాదాలు. మీ సిబ్బంది మా లగేజీని ఇలా భద్రపరుస్తున్నారు. ఇటీవల కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా, ఢిల్లీలో దిగిన తర్వాత నా బ్యాగ్ ఈ స్థితిలో కనిపించింది’ అని పోస్ట్‌ చేశారు. అదికాస్తా ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఎయిరిండియా వెంటనే స్పందించింది. ‘ప్రియమైన రాంపాల్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మీ టిక్కెట్ వివరాలు, బ్యాగ్ ట్యాగ్ నంబర్, ఫిర్యాదు నంబర్/డీబీఆర్‌ కాపీని పంపించండి. వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటాం’ అని ఎయిరిండియా తెలిపింది.

ఇదీ చదవండి: పేరుకు స్మాల్‌ క్యాప్‌.. ఆ సంస్థల్లో పెట్టుబడెందుకు?

ఎయిర్‌లైన్‌ కంపెనీలు టికెట్‌ ధరలు పెంచడం, తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తున్నామని ప్రకటనలు చేయడంపై ఉన్న శ్రద్ధ ఆ సర్వీసులు అందించడంలో లేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా విమానయాన సంస్థలు స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement