Bad experience
-
భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!
భారత హాకీ స్టార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాణి రాంపాల్‌కు ఇటీవల విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేపుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపింది.వివరాల్లోకి వెళితే..రాణి రాంపాల్ ఇటీవల ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి ఇండియా తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యాక తన లగేజీ తీసుకుందామని వెళ్లేసరికి ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తన లగేజీ బ్యాగ్ పగిలి ఉండడం గమనించారు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిరిండియా పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ఎయిర్‌లైన్‌కు వ్యతిరేకంగా తన ఆందోళనను తెలియజేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ పంచుకున్నారు.Thank you Air India for this wonderful surprise. This is how your staff treat our bags. On my way back from Canada to India this afternoon after landing in Delhi I found my bag broken.@airindia pic.twitter.com/xoBHBs0xBG— Rani Rampal (@imranirampal) October 5, 2024‘ఎయిర్ ఇండియా, మీరిచ్చిన అద్భుతమైన సర్వీసుకు ధన్యవాదాలు. మీ సిబ్బంది మా లగేజీని ఇలా భద్రపరుస్తున్నారు. ఇటీవల కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా, ఢిల్లీలో దిగిన తర్వాత నా బ్యాగ్ ఈ స్థితిలో కనిపించింది’ అని పోస్ట్ చేశారు. అదికాస్తా ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎయిరిండియా వెంటనే స్పందించింది. ‘ప్రియమైన రాంపాల్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మీ టిక్కెట్ వివరాలు, బ్యాగ్ ట్యాగ్ నంబర్, ఫిర్యాదు నంబర్/డీబీఆర్ కాపీని పంపించండి. వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటాం’ అని ఎయిరిండియా తెలిపింది.ఇదీ చదవండి: పేరుకు స్మాల్ క్యాప్.. ఆ సంస్థల్లో పెట్టుబడెందుకు?ఎయిర్‌లైన్ కంపెనీలు టికెట్ ధరలు పెంచడం, తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తున్నామని ప్రకటనలు చేయడంపై ఉన్న శ్రద్ధ ఆ సర్వీసులు అందించడంలో లేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా విమానయాన సంస్థలు స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు. -
భోజనానికి కూర్చుంటే అందరి ముందు అవమానించాడు: నటి హేమ
ప్రముఖ నటి హేమ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందింది. పలు సినిమాల్లో అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. 'సాధారణంగానే ఇండస్ట్రీ వాళ్లంటే జనాలకి లోకువ. కెరీర్లో ఎన్నో కష్టాలు పడి తల్లి సపోర్ట్‌తో ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడంటే కారవాన్స్ వచ్చి అన్ని వసతులు ఉన్నాయి. కానీ అప్పట్లో షూటింగ్ లొకేషన్స్‌లో బట్టలు మార్చుకోవాలంటే సరైన ప్లేస్ ఉండేది కాదు. కనీసం టాయిలెట్స్ వసతి కూడా ఉండేది కాదు. భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో ఓ ప్రొడక్షన్ బాయ్ నన్ను అవమానించాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ సహా యూనిట్ అందరం కలిసి భోజనం చేస్తుండగా నేను అక్కడే వాళ్లతో పాటే తింటున్నాను. ఇంతలో ప్రొడక్షన్ బాయ్ వచ్చి.. ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి తిను అని అవమానించాడు. ఆ మాటతో చాలా కోపం వచ్చింది. టేబుల్ ఎత్తి అతనిపై పడేద్దామనుకున్నా. కానీ తింటే వీళ్లందరితోనే కలిసి తినాలని డిసెడ్ అయి మరింత కష్టపడ్డాను. ఆ ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ ఉన్నాడు. మళ్లీ అతనే ఓ సినిమా షూటింగ్ సమయానికి వచ్చి చాలా మర్యాదగా నాకు భోజనం పెట్టాడు. కానీ కెరీర్లో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఇప్పటికీ మర్చిపోలేను' అంటూ చెప్పుకొచ్చింది. -
‘మరో లోకేష్ బాబు వచ్చారు’.. మాజీమంత్రి కుమారుడికి చేదు అనుభవం
మీ నాన్న 30 ఏళ్లు మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఏ రోజైనా ఇటు వచ్చారా? సమస్యలు విన్నారా? మేము దళితులమనే మా ప్రాంతాన్ని చిన్నచూపు చూశారు. కనీసం కట్టుకున్న ఇళ్లు కూడా దక్కకుండా చేశారు. ఇప్పుడు అధికారం లేదని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. ఇదేనా ప్రజాసేవ అంటే..? ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయడమెందుకు..? అంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌ను స్థానికులు నిలదీయడంతో ఆయన కంగుతిన్నారు. అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి / శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వంపై బురదజల్లేందుకు వచ్చి ప్రజావ్యతిరేకతతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి సమీపంలోని రామచంద్రాపురం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 1,748 మందికి ఇందిరమ్మ గృహాలు మొదటి విడత కింద మంజూరు చేశారు. ఆ ప్రాంతానికి రాజీవ్‌నగర్ కాలనీగా నామకరణం చేసి, ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హఠాన్మరణంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగారు. ఆయన మంత్రిగా పలు కీలక పదవులు అలంకరించారు. ఆ సమయంలో రాజీవ్‌నగర్ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే దురుద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పక్కాగృహాలు అసంపూర్తిగా దర్శనమిస్తుండడంతో అధికారులు పట్టాలను రద్దుచేయడంతోపాటు ముందుగానే నోటీసులిచ్చి లబ్ధిదారులకు తెలియజేశారు. ఇది ఎవరికీ గుర్తుండవనుకుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు శ్రీకాళహస్తిలో పర్యటనకు సిద్ధపడ్డారు. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఒకరు పద్మాలయ చెరువును ఆక్రమించి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఇది తెలుసుకున్న అధికారులు ఆ నిర్మాణాలను తొలగించి పద్మాలయ చెరువులో బోర్డులు నాటారు. ఇది జరిగి పది రోజులైంది. అయితే గత సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న బొజ్జల సుధీర్‌రెడ్డి హడావుడిగా వెళ్లి పద్మాలయ చెరువు ఆక్రమణల విషయమై నానాయాగీ చేశారు. అంతేకాకుండా రాజీవ్‌నగర్‌లో లబ్ధిదారులకు అండగా ఉంటానంటూ మంగళవారం ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం కొంత మందితో అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. టీడీపీ ప్రభుత్వంలో రాజీవ్నగర్ని నిర్మించామని బొజ్జల సుధీర్ నోరు జారారు. బొజ్జల మాట విన్న స్థానికులు కొందరు ‘మరో లోకేష్ బాబు వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో ఆయన చిన్నగా అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. -
ప్రచారంలో ప్రతిపాడి టీడీపీ అభ్యర్థి రాజా భార్యకు చేదు అనుభవం
-
ఎంపీ సీఎం రమేశ్‌కు చేదు అనుభవం
► రోడ్డు వేశాకే వీధిలోకి అడుగుపెట్టాలని ముస్లిం మహిళల డిమాండ్ సాక్షి, చాపాడు: టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చుక్కెదురైంది. బుధవారం వైఎస్సార్ జిల్లా చాపాడులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ముస్లిం మైనార్టీ మహిళలు నిలదీశారు. జెడ్పీ హైస్కూల్ వెనుక వీధిలో ఆయన పర్యటించగా... సిమెంట్ రోడ్డు వేశాకే వీధిలోకి రావాలని మహిళలు అడ్డుకున్నారు. తమ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాలని మూడేళ్లుగా విన్నవిస్తున్నా పట్టించుకోలేదని, ఇప్పుడొచ్చి మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం కాదని, చేసి చూపించాలని స్పష్టం చేశారు. గట్టిగా అరవొద్దు.. చిన్నగా చెప్పండని సీఎం రమేశ్ చెప్పగా... సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలోకి అడుగుపెట్టాలని మహిళలు తెగేసి చెప్పారు. అలాగే టీడీపీకి చెందిన పలువురు సర్పంచ్‌లు స్పెషల్ గ్రాంటు కింద చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని సీఎం రమేశ్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.