పరిమళించిన సేవాభావం
కృష్ణలంక :
పుష్కరాల భక్తులకు వాలంటీర్లు చేస్తున్న సేవలను యాత్రికులు కొనియాడుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ బీఈడీ విద్యార్థులు పద్మావతి ఘాట్‌లో పుణ్నస్నానాలు ఆచరించేందుకు వస్తున వికలాంగులు, వృద్ధులకు చేయూతనందిస్తున్నారు. పలు బస్టాప్‌ల నుంచి ఘాట్‌ల వరకు వృద్ధులు, వికలాంగులను చేరవేయటంతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చిన పుష్కర యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చి అస్వస్థకు గురైన యాత్రికులను ఘాట్‌లలో ఏర్పాటు చేసిన వైద్యకేంద్రాలలో ప్రాథమిక చికిత్సను చేయించి వారికి సపర్యలు చేస్తు యాత్రికుల మన్నలను అందుకుంటున్నారు.