
మరిన్ని వివరాల కోసం 94003 99999, 74834 32752, 99800 05519, 95444 44693 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వేములవాడ: వేములవాడ రాజన్న జాతర మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హెలిట్యాక్సీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి రాజన్న గుడి చెరువు కట్టపై స్థల పరిశీలన చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు గగనతలంలో 7 నిమిషాలపాటు తిరిగేందుకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున తీసుకోనున్నారు.
నాంపల్లి గుట్ట, వేములవాడ పట్టణం చుట్టూ తిప్పుతూ తిరిగి గుడి చెరువు వద్దకు తీసుకువస్తారు. 15 నిమిషాలు గగనతలంలో విహరించేందుకు ఒక్కొక్కరికి రూ.5,500 తీసుకొని నాంపల్లి గుట్ట, మిడ్‌మానేరు చూపించనున్నారు. హెలికాప్టర్ ఒక్కో ట్రిప్పులో ఐదుగురి చొప్పున తీసుకెళ్తారని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94003 99999, 74834 32752, 99800 05519, 95444 44693 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి: వైరల్: ఆకలేస్తే అంతేమరీ!