helicopter ride
-
మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
రాయ్‌పూర్: టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్ రైడ్ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. #WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022 𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁 देखिए, बच्चे कितने खुश हैं! हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे। आज इसकी शुरुआत हो गयी है। कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx — Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని
స్కై డైవింగ్ అంటేనే సాహసం. కొద్దిసేపు ఊపిరి ఆడనట్టు అనిపించినా.. ఆ తరువాత ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంటే వచ్చే థ్రిల్ అనుభవిస్తే కానీ తెలియదు. అలా ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ హెలికాప్టర్ స్పిన్స్ కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు యూఎస్‌కు చెందిన ఓ స్కై సర్ఫర్. నేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్‌లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్ తిరిగిన కీత్ కెబె రికార్డు బ్రేక్ చేశాడు. వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి స్పిన్స్ చేస్తున్న కెబె వీడియోను గిన్నిస్ ఇటీవల విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 4న ఈ ఫీట్ చేసిన కెబె.. 2021 ఈజిప్ట్‌లోని గిజాలోనూ ఇలాంటి స్పిన్సే చేశాడు. కాకపోతే అప్పుడు సింగిల్ జంప్‌లో 165 స్పిన్స్ చేశాడు. ఇప్పుడు మరో పది యాడ్ చేసి.. సింగిల్ జంప్‌లో 175 సార్లు తిరిగి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడన్నమాట. -
తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి
ముంబై: కష్టపడి పెంచి పెద్ద చేసింది.. తండ్రి లేని లోటును పూడుస్తూ.. అన్నీ తానై వ్యవహరించి స్థితిమంతులుగా తీర్చిదిద్దింది. అటువంటి మాతృమూర్తికి పుట్టిన రోజు సందర్భంగా ఓ తనయుడు అరుదైన కానుక అందించాడు. ఆమె జీవితంలో ఎప్పుడూ ఎరుగని గిఫ్ట్ ఇవ్వడంతో ఆ తల్లి ఆనందంలో మునిగి తేలింది. ఆమె కళ్లల్లో ఆనందం చూసి ఆ తనయుడు తన్మయత్వం పొందాడు. ఆ తల్లీకుమారుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన రేఖకు ముగ్గురు సంతానం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అర్దాంతరంగా తనువు చాలించాడు. అప్పటి నుంచి పిల్లలను ఆమె కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచింది. ఇతరుల ఇళ్లల్లో పనిచేసి వీరిని పోషించింది. ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానంలో స్థిరపడేలా శక్తి మేరకు కష్టపడింది. తల్లి కష్టానికి తగ్గట్టు పిల్లలు స్థిరపడ్డారు. అయితే 19వ తేదీన తల్లి 50వ జన్మదినం సందర్భంగా ఆమె చిరకాల కోరిక నెరవేర్చాలని పెద్ద కుమారుడు ప్రదీప్ నిర్ణయించుకున్నాడు. ప్రఖ్యాత్య ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తున్న కుమారుడు ప్రదీప్ తన చిన్నప్పుడు ఇంటిపై ఉండగా హెలికాప్టర్ వెళ్తుంటే ‘మనం ఎప్పుడైనా అందులో కూర్చోగలమా’ అని తల్లి ఆవేదన చెందింది. ప్రదీప్ ఆ మాటను అప్పటి నుంచి మనసులో దాచుకున్నాడు. ఎలాగైనా అమ్మను హెలికాప్టర్ ఎక్కించాలని ధ్రుడంగా అనుకున్నాడు. ఇప్పుడు స్థితిమంతులుగా కావడంతో కుమారుడు ప్రదీప్ తల్లి 50వ జన్మదినోత్సవం సందర్భంగా హెలికాప్టర్ ఎక్కించాడు. జుహు ఎయిర్‌బేస్‌కు వెళ్లి తల్లితో పాటు కుటుంబసభ్యులను హెలికాప్టర్లో కూర్చొబెట్టారు. ఉల్లాస్‌నగర్ పట్టణమంతా హెలికాప్టర్ రెండు రౌండ్లు చక్కర్లు కొట్టింది. కుమారుడు తన మాటలను గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఆ కోరిక తీర్చడంతో ఆ తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆకాశం ఎత్తుపై నుంచి భూమిని చూస్తుండగా పిల్లలు కేరింతలు కొట్టగా.. ఆ తల్లి మాత్రం కుమారుడిని చూస్తూ కన్నీళ్లు రాల్చింది. ఆ తల్లీకుమారుడు ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తల్లీకుమారుల ప్రేమానుబంధంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. తల్లికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన ఆ కుమారుడిని ప్రశంసిస్తున్నారు. -
నేటి నుంచి వేములవాడలో హెలీకాప్టర్ సేవలు
వేములవాడ: వేములవాడ రాజన్న జాతర మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హెలిట్యాక్సీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి రాజన్న గుడి చెరువు కట్టపై స్థల పరిశీలన చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు గగనతలంలో 7 నిమిషాలపాటు తిరిగేందుకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున తీసుకోనున్నారు. నాంపల్లి గుట్ట, వేములవాడ పట్టణం చుట్టూ తిప్పుతూ తిరిగి గుడి చెరువు వద్దకు తీసుకువస్తారు. 15 నిమిషాలు గగనతలంలో విహరించేందుకు ఒక్కొక్కరికి రూ.5,500 తీసుకొని నాంపల్లి గుట్ట, మిడ్‌మానేరు చూపించనున్నారు. హెలికాప్టర్ ఒక్కో ట్రిప్పులో ఐదుగురి చొప్పున తీసుకెళ్తారని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94003 99999, 74834 32752, 99800 05519, 95444 44693 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చదవండి: వైరల్: ఆకలేస్తే అంతేమరీ! -
వాలెంటైన్స్ డే.. మీరేం చేస్తున్నారు?
టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడవుతోంది. మరికొన్ని గంటలు గడిస్తే చాలు.. వేలెంటైన్స్ డే వచ్చేస్తోంది. మరి ఈసారి మీరు ఏం చేస్తున్నారు? ప్రియురాలికి వెరైటీగా ఏం గిఫ్టు ఇస్తున్నారు? సరిగ్గా ఇదే విషయమై ఓ సర్వే చేస్తే.. చాలామంది మంచి రొమాంటిక్ డిన్నర్‌కు తీసుకెళ్తామని చెబుతున్నారట. మరికొందరు మాత్రం ఓ అడుగు ముందుకేసి.. తమ నెచ్చెలిని హెలికాప్టర్ రైడ్‌కు తీసుకెళ్తామని అంటున్నారు. 'నియర్‌బై' అనే సంస్థ 3వేల మందిని సర్వే చేయగా, వాళ్లలో 45 శాతం మంది రొమాంటిక్ డిన్నర్ వైపే మొగ్గు చూపారు. 39 శాతం మంది మాత్రం వాళ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గిఫ్టు ఇస్తామని చెప్పారు. 18 శాతం మంది అయితే.. తమ ప్రియురాలిని హెలికాప్టర్ ఎక్కించి అలా 'గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే' అని పాటలు పాడేస్తామన్నారట. అయితే ఎక్కువ మంది మాత్రం రూ. 3 వేల నుంచి రూ. 5వేల వరకు మాత్రమే వేలెంటైన్స్ డే సందర్భంగా ఖర్చుపెడతామని.. అంతకంటే ఎక్కువ వదిలించుకునేది లేదని స్పష్టం చేశారు. ఇందులో కూడా ఏవైనా ఆఫర్లు, కూపన్లు ఉన్నాయేమోనని నెట్ ప్రపంచం మొత్తాన్ని గాలిస్తున్నారు. అసలు వేలైంటెన్స్ డే ఎందుకు జరుపుకొంటారని అడిగినప్పుడు.. తమ ప్రేమను ప్రకటించడానికే అని 43 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది మాత్రం అసలు జీవితంలో దీనికి మించిన సరైన పని ఏముంటుందని అడిగారు. మిగిలిన 13 శాతం మంది అందరితో కలిసి.. తోటి స్నేహితుల ఒత్తిడి వల్లే ఈ సంబరాలలో పాల్గొంటున్నట్లు చెప్పారు! సర్వేలో పాల్గొన్నవాళ్లలో 62 శాతం మంది తాము చిట్టచివరి నిమిషం వరకు ప్లానింగ్‌లోనే ఉంటామని తెలిపారు. -
ఐఆర్సీటీసీ నుంచి హెలికాప్టర్ సర్వీసులు!
ఐఆర్సీటీసీ అనగానే కేవలం రైళ్ల టికెట్లు బుక్ చేసుకోడానికే అనుకుంటాం కదూ.. కానీ ఇప్పుడు సరికొత్త సేవల్లోకి కూడా ఈ సంస్థ దిగుతోంది. ముంబై నగరాన్ని హెలికాప్టర్లోంచి చూపించే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సేవను ప్రారంభించారు. ముంబై నగరాన్ని ఒక్కసారి హెలికాప్టర్లో అలా చుట్టి రావాలంటే.. రూ. 5,580 చార్జీ అవుతుందని ఐఆర్సీటీసీ రీజనల్ డైరెక్టర్ వీరేందర్ సింగ్ తెలిపారు. జుహు ఏరోడ్రమ్ నుంచి హెలికాప్టర్ ఎక్కి అలా చుట్టు తిరగొచ్చు. మంగళ, శుక్రవారాల్లో దక్షిణ ముంబై పర్యటన ఉంటుంది. జుహు, బాంద్రా-వర్లి సీలింక్, హజీ అలీ ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఉత్తర ముంబై మార్గానికి సోమ, శనివారాల్లో ట్రిప్పులుంటాయి. అందులో జుహు, వెర్సోవా, మలాడ్, గొరాయ, పగోడా, ఎస్సెల్ వరల్డ్ ప్రాంతాలు కవరవుతాయి. హెలికాప్టర్ సముద్రమట్టానికి వెయ్యి అడుగుల ఎత్తున ఎగురుతుంది కాబట్టి ఇదంతా చాలా సరదాగా ఉంటుందని వీరేందర్ సింగ్ చెప్పారు.