voluntaries
-
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్‌అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో ఈ నెల 9న వలంటీర్లపై పవన్ నిరాధార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్లలోని మహిళలను కించపరిచేలా.. అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను పవన్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. చదవండి: ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై అడ్డగోలు వాగింది! అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆప్యాయంగా పలుకరించే వలంటీర్ సోదరులకు దురుద్దేశాలను ఆపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వలంటీర్లుగా దాదాపు 53 శాతం మంది యువతులు సేవలందిస్తుండగా సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చదవండి: అయ్యా జల్సా రాయుడు గారూ.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ -
ఏపీ మహిళా వాలంటీర్ల పై బాబు కామెంట్స్...
-
అయ్యా జల్సా రాయుడు గారూ.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా నిరసనలు పెల్లుబికాయి. అన్ని జిల్లాల్లో వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. పలుచోట్ల పవన్‌పై పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పవన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తలచుకొంటే వారాహి యాత్ర ముందుకు సాగదని హెచ్చరించారు. ఈ క్రమంలో వాలంటీర్లు పవన్‌కు మరో లేఖ రాశారు. లేఖలోలో..‘‘పావలా అంత పరువు కూడా లేని పవన్ కల్యాణ్‌కు ఒక లక్షా 30 వేల మంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రేసే రెండో లేఖ ఏమనగా...అయ్యా జల్సా రాయుడు గారూ.. మీరు మమ్మల్ని మానవ అక్రమ రవాణాకు పాల్పడే క్రిమినల్స్ అన్నారు. ఒంటరి ఆడవాళ్ళ సమాచారం సేకరిస్తామని..యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల వివరాలు సేకరిస్తామని దానిని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నామని మా ఆత్మాభిమానంపై దాడి చేశారు. మమ్మల్ని కన్నవారి ఆత్మాభిమానంపై దాడి చేశారు. చదవండి: నా పార్టీ వాళ్లే నన్ను నమ్మడం లేదు: పవన్ కళ్యాణ్ మీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మేము ఆందోళన చేస్తే మహిళా వాలంటీర్లు తప్పు చేశారు కాబట్టే.. భయపడి నన్ను తిడుతున్నారు అన్నారు. అయ్యా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అని మీ రాజకీయ ప్రత్యర్దులు అనగానే చెప్పు చూపించి కొడతామన్నారు. మరి మీరు కూడా ప్యాకేజీ పుచ్చుకుని తప్పు చేసినట్టే కదయ్యా. ఆ విషయం బయట పడిందనే భయంతోనే చెప్పు చూపించారా అయ్యా. సినిమాకో క్యారెక్టర్, సినిమాకో హీరోయిన్ను మార్చే మీకు మహిళలంటే చాలా గౌరవం అనుకున్నాము కానీ.. ఇంత చిన్న చూపు అనుకోలేదయ్యా. కానీ ఒక్క విషయం అయ్యా.. హీరోయిన్ పక్కన డ్యాన్సులు వెయ్యడం సులభం. మహిళల్ని గౌరవించాలనే సంస్కారం సినిమా క్యారెక్టర్‌తో రాదయ్యా. ఆ క్యారెక్టర్ మన పుట్టుకలో ఉండాలి. అయ్యా జల్సా రాయుడు గారూ.. మనం వద్దనుకుంటే విడాకులిచ్చేయవచ్చు. అది మన వ్యక్తిగతం కావచ్చు. కానీ గుర్తుపెట్టుకొండయ్యా. విలువలకు విడాకులు ఇవ్వకూడదయ్యా. ఇలా అడుగుతున్నామని ఏమీ అనుకోవద్దు. మీ ఇంట్లో ఓ ఆడపిల్ల ప్రేమ పెళ్ళి చేసుకుందని, మీ ఆత్మ గౌరవం దెబ్బతిందని, తుపాకీ పట్టుకుని వీధిరౌడీలా నడిరోడ్డుపైకొచ్చారు గుర్తుందా.. మరిప్పుడు మీరాజకీయాలకోసం లక్షా 30 వేల మంది మహిళల ఆత్మ గౌరవం దెబ్బ తీశారే ఇప్పుడు మా అమ్మానాన్న ఏం పట్టుకుని మీ ఇంటి దగ్గరకు రావాలో మీరే చెప్పండి. అయ్యా జల్సా రాయుడు గారూ.. అసలు వాలంటీర్లు అంటే ఎవరో తెలుసా మీకు. వాలంటీర్ల గురించి ఏమనుకుంటున్నావ్.. వాలంటీర్లు అంటే బైక్ లకు సైలెన్సర్లు పీకి రయ్ రయ్ మంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో స్క్రీన్లు చింపి, కుర్చీలు విరగొట్టి నిప్పుపెట్టే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవన్ పవన్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజైన రోజే ఫ్లాప్ ఫ్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే మహిళలన్న గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే రేణు దేశాయ్ ను కూడా గౌరవం లేకుండా అవమానించే చిల్లర బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే ఎయిర్ పోర్టుల్లో మంత్రులపై కర్రలతో, రాళ్లతో దాడులు చేసే గూండా బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి.. దాని ముందు సెల్ఫీలు దిగే అల్లాటప్పా బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే నీ పేరు చెప్పి వృద్ధుల దగ్గర సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కొట్టేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికెత్తుకునే బానిస బ్యాచ్ అనుకున్నావా? రాసుకోండి జల్సా రాయుడు గారూ.. రాసి పెట్టుకోండి.. వాలంటీర్లు అంటే అవ్వాతాతల గుండె చప్పుడు. సంక్షేమ లబ్దిదారుల చిరునవ్వు.. ఆపన్నుల ఆత్మవిశ్వాసం. బడుగు హలహీన వర్గాల భరోసా. సీఎం జగన్ మాకు బోధించిన కర్తవ్యం ఇదే. ఇది సార్ వాలంటీర్ వ్యవస్ధ అంటే.. ఇది సార్ సేవా సైన్యం అంటే. అయినా క్యారవ్యాన్ ఫుడ్డు, క్యారవాన్ బెడ్డు. మీకెలా తెలుస్తుందిలే’ అంటూ లేఖ ద్వారా పవన్‌ను ఎండగట్టారు. -
వాలంటీర్లు లేకపోతే ఇన్ని పథకాలు ప్రజలకు అందకపోయేవి
-
ఈ వాలంటీర్ వ్యవస్థకు శతకోటి వందనాలు
-
వాలంటీర్లు ఉద్యోగులు కాదు. మన ఇంట్లో వాళ్ళు దయచేసి వాళ్ళను...
-
నాకు కాళ్లు లేకపోయినా ప్రజలకు వాలంటీరుగా సేవ చేసే అవకాశం కల్పించారు.. నాకు పెన్షన్ కూడా ఇస్తున్నారు..!
-
సీఎం జగన్ విజయవాడ పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌కు సీఎం చేరుకుంటారు. వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి.. ఉత్తమ వలంటీర్లను సీఎం సత్కరిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి పైరవీలు, అవినీతికి తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ సత్కరించనుంది. కనీసం ఒక ఏడాది పాటు వలంటీరుగా పనిచేస్తూ ఎలాంటి ఫిర్యాదుల్లేని వలంటీర్లను ప్రభుత్వం సత్కరించి నగదు బహుమతి అందజేయనుంది. చదవండి: 19 నుంచి ‘వలంటీర్లకు వందనం’ -
ఏపీ: కొనసాగుతున్న ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పంపిణీ
-
గర్భిణీ మహిళను డోలీలో మోసుకెళ్లిన వాలంటీర్లు : విజయనగరం
-
ఇంద్రునికి వజ్రాయుధం లాగా మహిళలకు దిశా యాప్ ఇచ్చారు
-
వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉంది : దొరబాబు
-
సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సేవలు
సాక్షి, తాడేపల్లి: గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి రేపటితో ఏడాది పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పని తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామ స్వరాజ్యం.. గాంధీజీ కల... అనే మాటలు 70 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం.ఆ మాటలను నిజం చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది. గతంలోలో పింఛను, రేషన్ కార్డ్ కావాలంటే ఎమ్డీఓ ఆఫీస్ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం అవుతున్నాయి. పింఛన్, రేషన్ కార్డులు కూడా వెంటనే మంజూరు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు, పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలు నిర్ణయించాలి. కానీ ఇప్పుడు ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. ఇంత మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. గ్రామంలో అద్భుతమైన సచివాలయ బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో అవసరమైన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మండలానికి ఇలాంటి బిల్డింగ్ ఒక్కటి కూడా ఉండేది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లను అవమాన పరిచే విధంగా మాట్లాడారు’ అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ‘చర్చకు బాబు రాకుంటే లోకేష్‌ను పంపండి’) కరోనా సమయంలో వాలంటీర్ల పనితీరు అద్భుతమని ప్రశంసించారు శ్రీకాంత్‌రెడ్డి. ‘వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా టైంలో ఆయుష్ మాత్రలు కేవలం రెండు గంటల్లోనే పంపిణీ చేశాం. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి కూడా అభినందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్లవారకముందే అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా పింఛన్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 47 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే.. ఇప్పుడు 61, 65,000 లబ్ధిదారులు ఉన్నారు. నెల.. నెల పింఛన్ పొందే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇది ఒక అద్భుతం. మా ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం. గతంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడి పోలీసుల చేత దెబ్బలు తినే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పొలం దాకా విత్తనాలను సప్లై చేస్తోంది. చెత్త ద్వారా సంపద సృష్టిస్తామని గతంలో లోకేష్ చెప్పాడు. సంపద ఎక్కడ ఎలా సృష్టించాడు’ అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘నీరు-చెట్టు పేరుతో దోచుకున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన అప్పులు పెరుగుతాయి... ఆస్తులు తగ్గుతాయి. మా ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవం తీసుకు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 16 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. చంద్రబాబు తనను తానే రక్షించుకో లేకపోయారు. గత ప్రభుత్వంలో నా పైన తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబు తన పాలనలో జరిగిన అవినీతి పైన తాను విచారణకు సిద్ధం అంటారు. తీరా విచారిస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు పై ఉన్న కోర్టు స్టే లు ఎత్తేస్తే వాళ్ళ అవినీతి బాగోతం బయట పడుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది’ అని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. -
వార్డు వాలంటీర్లపై టీడీపీ నేతల దాడి
-
కరోనా వారియర్స్
-
ఓర్వలేక బరి తెగింపు
సాక్షి, శ్రీకాకుళం: ఐదేళ్లలో ప్రజలకు నరకం చూపించారు. భౌతిక దాడులు చేశారు. హత్యలకు కూడా తెగబడ్డారు. ఇది చాలదన్నట్లుగా జన్మభూమి కమిటీలంటూ పేట్రేగిపోయారు. ఇంత జరిగినా సహనం తో ఎన్నికల వరకు జనమంతా వేచి చూశారు. ఆ తర్వాత దిమ్మ దిరిగినట్లుగా బుద్ధి చెప్పారు. కానీ వారి ఆలోచన తీరు మారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా జిల్లాల్లో ఉన్నత నేతల వరస ఏమీ మారలేదు. వలంటీర్లను అవహేళనచేస్తూ మాట్లాడిన చంద్రబాబు వ్యవహారంపై రాష్ట్ర వ్యా ప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బాటలోనే జిల్లాలోని కొందరు నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అటు అచ్చెన్న, కూన రవి తదితర అగ్రనేతలతో పాటు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కూడా బరితెగిస్తున్నారు. అధికారులను వదలడం లేదు. తలుపులేసి కొడతామంటూ బెదిరిస్తున్నారు. ఇప్పుడు వలంటీర్ల వంతు వచ్చినట్లుగా వారిపై ఎక్కడికక్కడ భౌతిక దాడులు, పరుష పదజాలాలతో వేధింపులు మొదలెట్టారు. దీంతో జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తగ్గలేదంటూ జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ జనం కోరుకుతున్నారు. తాజాగా మంగళవారం టెక్క లి మండలం చాకిపల్లిలో ఇద్దరు వలంటీర్లు కత్తుల కుమారస్వామి, జలుమూరు అప్పన్నలపై టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ పంగ వసంత్, మాజీ సర్పంచ్ పంగ తవిటయ్య, పంగ పెంటయ్యల బృందం భౌతిక దాడులకు దిగింది. పింఛన్ల పంపిణీ సమయంలో ఇద్దరు వలంటీర్లపై దాడులకు దిగారు. సముదాయిద్దామని మధ్యలోకి వచ్చిన కృష్ణ అనే వృద్ధుడిపై కూడా టీడీపీ నేతలు దారుణంగా దాడి చేశారు. సెల్ఫోన్లు పగులగొట్టారు. దాడులకు దిగారిలా.. ∙సెప్టెంబర్ 9న టెక్కలి నియోజకవర్గం పాతనౌపడకు చెందిన గ్రామ వలంటీరుపై టీడీపీ కార్యకర్తలు మర్ధల సురేష్ తదితరులు భౌతిక దాడులు చేశారు. ∙సెప్టెంబర్ 9వ తేదినే భామిని మండలం తాలాడ గ్రామంలో వలంటీర్లుగా పనిచేస్తున్న వారిపై టీడీపీ నేతలు వలరౌతు అచ్చుతరావు, వలరౌతు శివ తదితరులు కులం పేరుతో దూషించి, వాగ్వాదానికి దిగారు. ► సెప్టెంబర్ 13న రాజాం పట్టణంలో వార్డు వలంటీర్లుగా పనిచేస్తున్న టి.శైలజ, జి.లావణ్య, కె.ఆదిలక్ష్మి, ఎ.నవ్యలపై 10వ వార్డు టీడీపీ నేత కాకర్ల సత్యనారాయణ దారుణంగా పరుషంగా వేధింపులకు దిగాడు. దీనిపై పోలీసులకు బాధిత వలంటీర్లు ఫి ర్యాదు చేయగా, మీ అంతు చూస్తా అంటూ వలంటీర్లపై బెదిరింపులకు దిగాడు. ► సెప్టెంబర్ 21న రేగిడి మండలంలోని కొత్త చెలికానివలసలో వలంటీర్లపై తోట నాగభూషణం, తోట రామారావు, తోట జగన్ అనే వ్యక్తులు దూషణకు దిగారు. ఇందులో రామారావు వలంటీర్లపై దాడులకు ప్రయత్నించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► సెప్టెంబర్ 21నే పలాస పట్టణంలో ఉదయ పురం వార్డు వలంటీర్లు కొవ్వూరు లక్ష్మి, కొత్తపల్లి శోభారాణిలపై 22వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ గాలి కృష్ణారావు దాడులకు పాల్పడ్డాడు. ► అంతకుముందు ఇచ్ఛాపురంలో కూడా వలంటీర్లపై అక్కడి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడులకు దిగారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వలంటీర్లు ఆగస్టు 15 నుంచి విధుల్లోకి వస్తే.. ఇప్పటివరకు కనీసం పది మందిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గ్రామ/వార్డుల్లో ప్ర భుత్వ పథకాలను ముఖ్యంగా రేషన్ బియ్యం గా నాణ్యమైన బియ్యాన్ని ప్యాకెట్ల రూపంలో అందజేస్తున్న వలంటీర్లపై దాడులకు దిగుతున్నారు. ఈ దాడుల్లో మహిళలని కూడా చూడ కుండా తమ ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు. అగ్ర నేతల వారసులుగా... ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..’ అన్న చందంగా జిల్లాలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి ఎంపీడీఓపై పరుష పదజాలం తో బెదిరింపులకు దిగిన సంగతి మర్చిపోక ముందే రాజధాని ప్రాంతంలో విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌పై ‘యూజ్లెస్ ఫెలో..’ అంటూ వార్నింగ్ ఇచ్చి జిల్లా పరువు తీశారు. అలాగే మరో అగ్ర నేత మాజీ విప్ కూన రవికుమార్ ఏకంగా సరుబుజ్జిలి ఎంపీడీఓను ఉద్దేశించి తలుపులేసి బాదేస్తా అంటూ ఒంటికాలితో లేచాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంతో పరారీలో ఉండి, ఇటీవలే ముందస్తు బెయిల్‌పై అజ్ఞాతం వీడారు. ఇంతటి ఘన చరిత్రతో టీడీపీ అగ్రనేతలు చెలాయిస్తుంటే వారి వెంటే ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు తామేమీ తక్కువ కామంటూ వలంటీర్లపై దాడులకు దిగుతున్నారు. అలాగే గతంలో పనులు చేస్తామంటూ డబ్బులు దండుకున్న నేతలను ప్రశ్నిస్తున్న సామాన్యులపై కూడా బెదిరింపులు ఆపడం లేదు. అగ్రనేతలకు తామే వారసులమంటూ నిరూపించుకుంటున్నారు. దీనిపై జిల్లా వాసులంతా భగ్గుమంటున్నారు. వీరికి ఎన్నికల్లో తగిన శాస్తి జరిగినా ఏమాత్రం తగ్గడం లేదంటూ వాపోతున్నారు. తీరు మారదా.. జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వారు దాడులకు దిగుతున్నారు. అలాగే గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అసలైన అర్హులకే ఇస్తున్నందున కడుపు మంటతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి చిన్న చిన్న తగాదాలను సైతం గ్రామాల్లో రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీకి అనుబంధంగా ఉన్న యువకులను సైతం టార్గెట్ చేస్తున్నారు. అధికారం కోల్పోయి నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా అధికార దర్పం తగ్గడం లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రోజుకో తీరులో ప్రవర్తిస్తున్న వైనంతో ఇక్కడ కూడా నాయకులు వ్యవహార శైలిని మార్చుకుంటున్నారు. ఇప్పటికే పది మందికి పైగా వలంటీర్లపై దాడులకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఇక ముందు ప్రతి నెలా ఒక్కో నియోజకవర్గంలో టార్గెట్ చేసి దాడులకు పాల్పడతారని, ఇందుకోసం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 3 నుంచి వచ్చే నెల 30 వరకు గ్రామ సభలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీన్ని వేదికగా చేసుకుని, వాగ్వాదాలకు దిగి వలంటీర్లుపై దాడులకు దిగొచ్చని సమాచారం. -
అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు
-
పరిమళించిన సేవాభావం
కృష్ణలంక : పుష్కరాల భక్తులకు వాలంటీర్లు చేస్తున్న సేవలను యాత్రికులు కొనియాడుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ బీఈడీ విద్యార్థులు పద్మావతి ఘాట్‌లో పుణ్నస్నానాలు ఆచరించేందుకు వస్తున వికలాంగులు, వృద్ధులకు చేయూతనందిస్తున్నారు. పలు బస్టాప్‌ల నుంచి ఘాట్ల వరకు వృద్ధులు, వికలాంగులను చేరవేయటంతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చిన పుష్కర యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చి అస్వస్థకు గురైన యాత్రికులను ఘాట్లలో ఏర్పాటు చేసిన వైద్యకేంద్రాలలో ప్రాథమిక చికిత్సను చేయించి వారికి సపర్యలు చేస్తు యాత్రికుల మన్నలను అందుకుంటున్నారు.