సాక్షి, అమరావతి: వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్‌అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో ఈ నెల 9న వలంటీర్లపై పవన్ నిరాధార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించారు.
దీనిపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్లలోని మహిళలను కించపరిచేలా.. అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను పవన్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి.
చదవండి: ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై అడ్డగోలు వాగింది!
అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆప్యాయంగా పలుకరించే వలంటీర్ సోదరులకు దురుద్దేశాలను ఆపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వలంటీర్లుగా దాదాపు 53 శాతం మంది యువతులు సేవలందిస్తుండగా సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: అయ్యా జల్సా రాయుడు గారూ.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ
Comments
Please login to add a commentAdd a comment