AP Volunteers Second Open Letter To Pawan Kalyan On His Remarks - Sakshi
Sakshi News home page

అయ్యా జల్సా రాయుడు గారూ, వీటికి బదులిస్తారా.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ

Published Thu, Jul 13 2023 2:53 PM | Last Updated on Thu, Jul 13 2023 6:49 PM

AP Volunteers Second Open Letter To Pawan Kalyan On His Remarks - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా నిరసనలు పెల్లుబికా­యి. అన్ని జిల్లాల్లో వలంటీర్లు, సచివాలయా­ల ఉద్యోగులు, ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ దిష్టి బొమ్మలు దహనం చేశారు. పలుచోట్ల పవన్‌పై పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పవన్‌ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము తలచుకొంటే వారాహి యాత్ర ముందుకు సాగదని హెచ్చరించారు.

ఈ క్రమంలో వాలంటీర్లు పవన్‌కు మరో లేఖ రాశారు. లేఖలోలో..‘‘పావలా అంత పరువు కూడా లేని పవన్ కల్యాణ్‌కు ఒక లక్షా 30 వేల మంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రేసే రెండో లేఖ ఏమనగా...అయ్యా జల్సా రాయుడు గారూ.. మీరు మమ్మల్ని మానవ అక్రమ రవాణాకు పాల్పడే క్రిమినల్స్ అన్నారు. ఒంటరి ఆడవాళ్ళ సమాచారం సేకరిస్తామని..యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల వివరాలు సేకరిస్తామని దానిని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నామని మా ఆత్మాభిమానంపై దాడి చేశారు. మమ్మల్ని కన్నవారి ఆత్మాభిమానంపై దాడి చేశారు.

చదవండి: నా పార్టీ వాళ్లే నన్ను నమ్మడం లేదు: పవన్‌ కళ్యాణ్‌

మీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మేము ఆందోళన చేస్తే మహిళా వాలంటీర్లు తప్పు చేశారు కాబట్టే.. భయపడి నన్ను తిడుతున్నారు అన్నారు. అయ్యా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అని మీ రాజకీయ ప్రత్యర్దులు అనగానే చెప్పు చూపించి కొడతామన్నారు. మరి మీరు కూడా ప్యాకేజీ పుచ్చుకుని తప్పు చేసినట్టే కదయ్యా. ఆ విషయం బయట పడిందనే భయంతోనే చెప్పు చూపించారా అయ్యా. సినిమాకో క్యారెక్టర్, సినిమాకో హీరోయిన్‌ను మార్చే మీకు మహిళలంటే చాలా గౌరవం అనుకున్నాము కానీ.. ఇంత చిన్న చూపు అనుకోలేదయ్యా.

కానీ ఒక్క విషయం అయ్యా.. హీరోయిన్ పక్కన డ్యాన్సులు వెయ్యడం సులభం. మహిళల్ని గౌరవించాలనే సంస్కారం సినిమా క్యారెక్టర్‌తో రాదయ్యా. ఆ క్యారెక్టర్ మన పుట్టుకలో ఉండాలి. అయ్యా జల్సా రాయుడు గారూ.. మనం వద్దనుకుంటే విడాకులిచ్చేయవచ్చు. అది మన వ్యక్తిగతం కావచ్చు. కానీ గుర్తుపెట్టుకొండయ్యా. విలువలకు విడాకులు ఇవ్వకూడదయ్యా.

ఇలా అడుగుతున్నామని ఏమీ అనుకోవద్దు. మీ ఇంట్లో ఓ ఆడపిల్ల ప్రేమ పెళ్ళి చేసుకుందని, మీ ఆత్మ గౌరవం దెబ్బతిందని, తుపాకీ పట్టుకుని వీధిరౌడీలా నడిరోడ్డుపైకొచ్చారు గుర్తుందా.. మరిప్పుడు  మీరాజకీయాలకోసం లక్షా 30 వేల మంది మహిళల ఆత్మ గౌరవం దెబ్బ తీశారే ఇప్పుడు మా అమ్మానాన్న ఏం పట్టుకుని మీ ఇంటి దగ్గరకు రావాలో మీరే చెప్పండి. అయ్యా జల్సా రాయుడు గారూ.. అసలు వాలంటీర్లు అంటే ఎవరో తెలుసా మీకు. వాలంటీర్ల గురించి ఏమనుకుంటున్నావ్..

  1. వాలంటీర్లు అంటే బైక్ లకు సైలెన్సర్లు పీకి రయ్ రయ్ మంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా?
  2. వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో స్క్రీన్లు చింపి, కుర్చీలు విరగొట్టి నిప్పుపెట్టే బ్యాచ్ అనుకున్నావా?
  3. వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవన్ పవన్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా?
  4. వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజైన రోజే ఫ్లాప్ ఫ్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ అనుకున్నావా?
  5. వాలంటీర్లు అంటే మహిళలన్న గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నావా?
  6. వాలంటీర్లు అంటే రేణు దేశాయ్ ను కూడా గౌరవం లేకుండా అవమానించే చిల్లర బ్యాచ్ అనుకున్నావా? 
  7. వాలంటీర్లు అంటే ఎయిర్ పోర్టుల్లో మంత్రులపై కర్రలతో, రాళ్లతో దాడులు చేసే గూండా బ్యాచ్ అనుకున్నావా? 
  8. వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి.. దాని ముందు సెల్ఫీలు దిగే అల్లాటప్పా బ్యాచ్ అనుకున్నావా? 
  9. వాలంటీర్లు అంటే నీ పేరు చెప్పి వృద్ధుల దగ్గర సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కొట్టేసే బ్యాచ్ అనుకున్నావా? 
  10. వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికెత్తుకునే బానిస బ్యాచ్ అనుకున్నావా?

రాసుకోండి జల్సా రాయుడు గారూ.. రాసి పెట్టుకోండి.. వాలంటీర్లు అంటే అవ్వాతాతల గుండె చప్పుడు. సంక్షేమ లబ్దిదారుల చిరునవ్వు.. ఆపన్నుల ఆత్మవిశ్వాసం. బడుగు హలహీన వర్గాల భరోసా. సీఎం జగన్ మాకు బోధించిన కర్తవ్యం ఇదే. ఇది సార్ వాలంటీర్ వ్యవస్ధ అంటే..  ఇది సార్ సేవా సైన్యం అంటే. అయినా క్యారవ్యాన్ ఫుడ్డు, క్యారవాన్ బెడ్డు. మీకెలా తెలుస్తుందిలే’ అంటూ లేఖ ద్వారా పవన్‌ను ఎండగట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement