
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌కు సీఎం చేరుకుంటారు. వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి.. ఉత్తమ వలంటీర్లను సీఎం సత్కరిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి పైరవీలు, అవినీతికి తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ సత్కరించనుంది. కనీసం ఒక ఏడాది పాటు వలంటీరుగా పనిచేస్తూ ఎలాంటి ఫిర్యాదుల్లేని వలంటీర్లను ప్రభుత్వం సత్కరించి నగదు బహుమతి అందజేయనుంది.
చదవండి: 19 నుంచి ‘వలంటీర్లకు వందనం’
Comments
Please login to add a commentAdd a comment