పోలీసుల ఓవరాక్షన్‌తో ఇక్కట్లు
పోలీసుల ఓవరాక్షన్‌తో ఇక్కట్లు
Published Sun, Aug 14 2016 9:24 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
విజయవాడ(భవానీపురం) :
పోలీసుల ఓవరాక్షన్‌తో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భవానీపురం స్వాతి సెంటర్ దగ్గర బస్సు దిగిన యాత్రికులు ఎదురుగా కనించే భవానీఘాట్‌కు చేరుకోగానే పోలీసులు వారిని నేరుగా ఘాట్‌లోకి అనుమతించకుండా అటు పొమ్మని పంపించేస్తున్నారు. దీంతో భక్తులు కొంచెం దూరం నడిచివెళ్లి అడ్డదారిలో ఘాట్‌కు చేరుకుంటున్నారు. ఈ అడ్డదారంతా మట్టి, చెత్తాచెదారంతో ఉండటంతో పడుతూ లేస్తూ ఘాట్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. పున్నమి ఘాట్‌లో సజావుగా రాకపోకలు సాగిస్తున్న భక్తులకు పోలీసులు బారికేడ్లు అడ్డంపెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్లాట్‌ఫాంపై బారికేడ్లు పెట్టి పక్కన చిన్న దారి వదిలి అందులోనించి వెళ్లమని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. పోలీసుల ఓవరాక్షన్‌కు కొందరు ఎదురు తిరగడంతో ముందు వారితో వాగ్వాదానికి దిగిన పోలీసులు తరువాత దూకుడు తగ్గించి అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించారు.
Advertisement