భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి | respect devotees | Sakshi
Sakshi News home page

భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి

Published Sun, Aug 14 2016 7:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి

భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి

 
డీజీపీ సాంబశివరావు
విజయవాడ (భవానీపురం) :
పుష్కరాలకు వచ్చే భక్తులతో స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలి తప్ప, వారితో అమర్యాదగా వ్యవహరించవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని డీజీపీ ఎన్‌.సాంబశివరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పున్నమిఘాట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులతో పోలిస్తే ఆదివారం భక్తులు రెట్టింపుగా రావడంతో పుస్కరఘాట్లు కళకళలాడుతున్నాయన్నారు. దుర్గగుడి, పున్నమి, భవానీ ఘాట్లవైపు ఉచిత బస్సు సౌకర్యాని ఆదివారం నుంచి కల్పించామని, అయితే భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో దుర్గాఘాట్‌ వద్ద కొంతసేపు ట్రాఫిక్‌ను నియంత్రించామని చెప్పారు. పరిస్థితినిబట్టి అవసరమైతే మళ్లీ ఉచిత బస్సులను పునరుద్దరిస్తామని తెలిపారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement