అందరికీ కావాలి.. ఎవరికీ పట్టదు
పుష్కర సందోహాన్ని ప్రజానీకానికి అందించే మీడియా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదు. వారి ప్రచారానికి మీడియా కావాలి, సౌకర్యాలను మాత్రం కల్పించరు.. ఇదీ పుష్కరాల్లో అధికారులు, పాలకుల వైఖరి అని మీడియా వర్గాలు విమర్శిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణవేణి ఘాట్‌లోని శనేశ్వరస్వామి గుడి దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నీడ కోసం హోర్డింగ్స్‌ను చిన్న కుటీరంగా మాదిరిగా ఏర్పాటు చేసుకుని అందులోనే సే
హోర్డింగ్సే ఆసరాగా మీడియా తిప్పలు
మొగల్రాజపురం :
పుష్కర సందోహాన్ని ప్రజానీకానికి అందించే మీడియా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదు. వారి ప్రచారానికి మీడియా కావాలి, సౌకర్యాలను మాత్రం కల్పించరు.. ఇదీ పుష్కరాల్లో అధికారులు, పాలకుల వైఖరి అని మీడియా వర్గాలు విమర్శిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణవేణి ఘాట్‌లోని శనేశ్వరస్వామి గుడి దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నీడ కోసం హోర్డింగ్స్‌ను చిన్న కుటీరంగా మాదిరిగా ఏర్పాటు చేసుకుని అందులోనే సేద తీరుతున్నారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. ఎవరైనా ప్రముఖులు, మంత్రులు, అ«ధికారులు వచ్చినప్పుడు విధులు నిర్వహించి మిగిలిన సమయంలో వీరుS కూర్చొడానికి నిలువ నీడ కూడా లేకపోవడంతో గుడి ఆవరణలో కుటీరంలా ఏర్పాటు చేసుకున్నారు. కెమెరాలకు వస్త్రాలను కప్పి రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేశారు. కుర్చోడానికి కుర్చీలు కూడా లేక నేలపైనే కూర్చుంటున్నారు. షామియనాలతో పాటుగా కుర్చీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. జిల్లా, నగర సమాచార శాఖ అధికారులకు ఇదేమీ పట్టడం లేదని మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో కనీసం మీడియా పాయింట్లు కూడా పెట్టకపోవడం శోచనీయమని వాపోయారు.