కోయిల్‌సాగర్ నీరు విడుదల చేస్తున్న ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి
దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఎప్పడెప్పుడా అంటూ అన్నదాతలు ఎదురుచూసిన కోయిల్‌సాగర్ నీళ్ల కాల్వల్లో పరుగెత్తాయి! కృష్ణా జలాలు గలగలా ముందుకు సాగుతుంటే రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పూజలు చేసి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఖరీ ఫ్ సాగుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశామని తెలిపారు. నీటిని వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలన్నారు. జూరాల నుంచి ఇన్‌ఫ్లో ఉన్నంత వరకు కోయిల్‌సాగర్‌లో సరిపడా నీరు ఉంచి మిగతాది వదులుతామని తెలిపారు. ఈ నీటితో గొలుసు కట్టు చెరువులను నింపుకోవాలని సూచించారు.
తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకం పనులు పూర్తయితే మొదట కర్వెన రిజర్వాయర్ ద్వారా 20 టీఎంసీల నీరు పాలమూరు వదలనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమానికి రైతుబందు, రైతుబీమా పథకలను అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ వచ్చే సారి కూడా టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులుతో పాటు శ్రీకాంత్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్, బాలస్వామి, ఉమామాహేశ్వర్‌రెడ్డి, జెట్టి నర్సింహ్మరెడ్డి, రాము, కొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కర్జన్‌రాజు, కర్వు శ్రీను పాల్గన్నారు.
Comments
Please login to add a commentAdd a comment