MLA aala venkateswarreddy
-
బిరబిరా కృష్ణమ్మ
దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఎప్పడెప్పుడా అంటూ అన్నదాతలు ఎదురుచూసిన కోయిల్‌సాగర్ నీళ్ల కాల్వల్లో పరుగెత్తాయి! కృష్ణా జలాలు గలగలా ముందుకు సాగుతుంటే రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పూజలు చేసి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఖరీ ఫ్ సాగుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశామని తెలిపారు. నీటిని వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలన్నారు. జూరాల నుంచి ఇన్‌ఫ్లో ఉన్నంత వరకు కోయిల్‌సాగర్‌లో సరిపడా నీరు ఉంచి మిగతాది వదులుతామని తెలిపారు. ఈ నీటితో గొలుసు కట్టు చెరువులను నింపుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకం పనులు పూర్తయితే మొదట కర్వెన రిజర్వాయర్ ద్వారా 20 టీఎంసీల నీరు పాలమూరు వదలనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమానికి రైతుబందు, రైతుబీమా పథకలను అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ వచ్చే సారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులుతో పాటు శ్రీకాంత్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్, బాలస్వామి, ఉమామాహేశ్వర్రెడ్డి, జెట్టి నర్సింహ్మరెడ్డి, రాము, కొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కర్జన్రాజు, కర్వు శ్రీను పాల్గన్నారు. -
పాలమూరును సస్యశ్యామలం చేస్తాం
భూత్పూర్ (దేవరకద్ర) : స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా ఏ ప్రభుత్వం రైతులకు సాగునీరందించలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో రైతులకు సాగునీరందిస్తున్నా మని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎల్కిచర్ల సమీపంలో మ ంగనూరు, లట్టుపల్లి నుంచి వచ్చే కేఎల్ ఐ కాల్వను ఎల్కిచర్ల, మద్దిగట్ల ద్వారా కమాలొద్దీన్‌పూర్ వరకు చేపట్టే కాల్వ పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కేఎల్ఐ ద్వారా ఎల్కిచర్ల, మద్దిగట్ల, కమాలొద్దీన్‌పూర్ వరకు చేపట్టే కాల్వ ప నులకు రూ.110 కోట్లు మంజూరు చేశారని, కేఎల్ఐ 25 టీఎంసీల సామర్థ్యం ఉండగా 40 టీఎంసీలకు పెంచామన్నా రు. మూడు నెలల్లో కాల్వ నిర్మాణం ప నులు పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆ దేశించారు. మంగనూరు, లట్టుపల్లి రైతు లు భూములు ఇవ్వడానికి నాగర్‌కర్నూ ల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో సమావేశం నిర్వహించి అక్కడి రైతులను ఒప్పించి అక్కడి నుంచి కాల్వ పనులు త్వ రగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామని నిరంజన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ నిరంజన్‌రెడ్డి సహకారంతోనే దేవరకద్ర నియోజకవర్గంలోని 10 గ్రామాల కు, వనపర్తి నియోజకవర్గంలో 15 గ్రా మాలకు సాగునీరందించే పనులను ప్రా రంభించామన్నారు. కార్యక్రమంలో రై తు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేట ర్ బస్వరాజ్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ నర్సింహులు, జెడ్పీటీసీ చంద్రమౌళి, వై స్ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చం ద్రశేఖర్‌గౌడ్, నాయకులు నారాయణ గౌడ్, సర్పంచ్‌లు చంద్రయ్య,నాగయ్య, అశోక్‌రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు. పెట్టుబడి సాయంతో మేలు వనపర్తి రూరల్: పెట్టుబడి సాయం పథకం రైతుల పాలిట వరంలాంటిదని నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, చందాపూర్, చిమనగుంటపల్లిలో ఆయన రైతులకు పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, సర్పంచ్ విష్ణు, కౌన్సిలర్లు గట్టుయాదవ్, రమేష్, సతీష్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నర్సింహ, తహసీల్దార్ రాజేందర్‌గౌడ్, మండల ప్రత్యేకాధికారి బాలక్పష్ణ, వ్యవసాయాధికారి హన్మంతురెడ్డి పాల్గొన్నారు. -
సాగునీటిని వృథా చేయొద్దు
► ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి ► ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచన ► ఫలించిన రైతుల పోరాటం ► కోయిల్‌సాగర్ నుంచి నీటి విడుదల నెల రోజులుగా కోయిల్‌సాగర్ రైతులు చేస్తున్న పోరాటం ఫలించింది. తాగు, సాగునీటి కోసం ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళన చేశారు. చివరకు ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోయిల్‌సాగర్ నుంచి నీటిని వదిలారు. కోయిల్‌సాగర్ (దేవరకద్ర రూరల్) : కోయిల్‌సాగర్ నీటిని రైతులు వృథా చేయొద్దని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. ఎంతో కష్టపడి లిఫ్టు ద్వా రా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కోయిల్‌సాగర్‌కు తె చ్చిన కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నారాయణపేట టీఆర్ఎస్ ఇన్చార్జ్ శివకుమార్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌కు సరఫరా చేసే తాగునీటికి ఇబ్బంది కలుగకుండా ఆయకట్టుకు వదులుతున్నామన్నారు. ఈ నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా 5 రోజుల పాటు ఆయకట్టు రైతులకు విడుదల చేస్తామన్నారు. ఎడమ కాల్వకు 30, కుడికాల్వకు 90 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలను మంత్రులు హరిశ్‌రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి వెంటనే నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే ఆయకట్టుకు నీటిని వదిలారు. కోయిల్‌సాగర్ నీటిని రాజకీయం చేయడానికి కొంత మంది నాయకులు ప్రయత్నించారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, ప్రాజెక్టు అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.