భూత్పూర్ : కాల్వ పనులను ప్రారంభిస్తున్న నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల
భూత్పూర్ (దేవరకద్ర) : స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా ఏ ప్రభుత్వం రైతులకు సాగునీరందించలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో రైతులకు సాగునీరందిస్తున్నా మని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎల్కిచర్ల సమీపంలో మ ంగనూరు, లట్టుపల్లి నుంచి వచ్చే కేఎల్ ఐ కాల్వను ఎల్కిచర్ల, మద్దిగట్ల ద్వారా కమాలొద్దీన్‌పూర్ వరకు చేపట్టే కాల్వ పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కేఎల్‌ఐ ద్వారా ఎల్కిచర్ల, మద్దిగట్ల, కమాలొద్దీన్‌పూర్ వరకు చేపట్టే కాల్వ ప నులకు రూ.110 కోట్లు మంజూరు చేశారని, కేఎల్‌ఐ 25 టీఎంసీల సామర్థ్యం ఉండగా 40 టీఎంసీలకు పెంచామన్నా రు. మూడు నెలల్లో కాల్వ నిర్మాణం ప నులు పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆ దేశించారు. మంగనూరు, లట్టుపల్లి రైతు లు భూములు ఇవ్వడానికి నాగర్‌కర్నూ ల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో సమావేశం నిర్వహించి అక్కడి రైతులను ఒప్పించి అక్కడి నుంచి కాల్వ పనులు త్వ రగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామని నిరంజన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ నిరంజన్‌రెడ్డి సహకారంతోనే దేవరకద్ర నియోజకవర్గంలోని 10 గ్రామాల కు, వనపర్తి నియోజకవర్గంలో 15 గ్రా మాలకు సాగునీరందించే పనులను ప్రా రంభించామన్నారు. కార్యక్రమంలో రై తు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేట ర్ బస్వరాజ్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ నర్సింహులు, జెడ్పీటీసీ చంద్రమౌళి, వై స్ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చం ద్రశేఖర్‌గౌడ్, నాయకులు నారాయణ గౌడ్, సర్పంచ్‌లు చంద్రయ్య,నాగయ్య, అశోక్‌రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు.
పెట్టుబడి సాయంతో మేలు
వనపర్తి రూరల్: పెట్టుబడి సాయం పథకం రైతుల పాలిట వరంలాంటిదని నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, చందాపూర్, చిమనగుంటపల్లిలో ఆయన రైతులకు పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, సర్పంచ్ విష్ణు, కౌన్సిలర్లు గట్టుయాదవ్, రమేష్, సతీష్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నర్సింహ, తహసీల్దార్ రాజేందర్‌గౌడ్, మండల ప్రత్యేకాధికారి బాలక్పష్ణ, వ్యవసాయాధికారి హన్మంతురెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment