mla rajender reddy
-
నారాయణపేట... నాలుగు లైన్ల బాట
నారాయణపేట: ఇటీవలే మనుగడలోకి వచ్చిన నారాయణపేట జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రూ.18.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. మండలంలోని సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్ రోడ్డులోని ఎర్రగుట్ట సీమీపం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్ద శంకుస్థాపన చేశారు. రూ.18.65 కోట్లతో రోడ్డు నిర్మాణం సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్‌రోడ్డు ఎర్రగుట్ట సమీపం వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. ఇందుకు గాను 2018 అక్టోబర్ 17న జీఓ 566ను ఆర్అండ్బీ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రూ.18.65 కోట్ల అంచనా వ్యయం కాగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి ఈనెల 11వ తేదీన అగ్రిమెంట్ కాగా.. ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహనదారులకు ఊరట నారాయణపేట నూతన జిల్లాలో అభివృద్ధికి తొలి అడుగు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంతో ఆరంభమైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సింగారం చౌరస్తా మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా మారనుంది. మక్తల్ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్లు, మరికల్ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మద్దూర్, కోస్గి మండలాల వారికి సైతం భూనేడ్ నుంచి వస్తే వారికి నారాయణపేట అందుకున్నట్లుంది. సింగారం నుంచి 5 కిలోమీటర్ల వరకు నాలుగులైన్ల రోడ్డు విస్తరణ జరుగుతుండడంతో ఈ ప్రాంత వాహనదారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నారాయణపేటలో అంతరాష్ట్ర రహదారిగా నాలుగు లైన్ల విస్తరణ జరగుతుండడంతో ఆటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రాంత వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా హైదరాబాద్, రాయచూర్ ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా వ్యవస్థ మెరుగుపడినట్లేనని భావిస్తున్నారు. డివైడర్లు.. పచ్చదనం నాలుగులైన్ల రోడ్డు 100 ఫీట్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా మధ్యలో డివైడర్, బట్లర్ఫ్లై లైట్లు ఏర్పాటుచేసి మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే ప్రాంతం సుందరంగా మారుతుందని భావిస్తున్నారు. ‘పేట’ అభివృద్ధికి శుభపరిణామం నారాయణపేట కొత్త జిల్లాలో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం అభివృద్ధికి శుభపరిణామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే వ్యాపార, విద్య రంగాలకు అనువుగా మారుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నారాయణపేట కేంద్రబిందువుగా ఉందని.. బంగారం, చేనేత రంగాలు ఇక్కడ ప్రసిద్ధి గాంచాయని వివరించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు చేస్తున్న కృషికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ చైర్మన్ సరాఫ్ నాగరాజు, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
బిరబిరా కృష్ణమ్మ
దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఎప్పడెప్పుడా అంటూ అన్నదాతలు ఎదురుచూసిన కోయిల్‌సాగర్ నీళ్ల కాల్వల్లో పరుగెత్తాయి! కృష్ణా జలాలు గలగలా ముందుకు సాగుతుంటే రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పూజలు చేసి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఖరీ ఫ్ సాగుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశామని తెలిపారు. నీటిని వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలన్నారు. జూరాల నుంచి ఇన్‌ఫ్లో ఉన్నంత వరకు కోయిల్‌సాగర్‌లో సరిపడా నీరు ఉంచి మిగతాది వదులుతామని తెలిపారు. ఈ నీటితో గొలుసు కట్టు చెరువులను నింపుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకం పనులు పూర్తయితే మొదట కర్వెన రిజర్వాయర్ ద్వారా 20 టీఎంసీల నీరు పాలమూరు వదలనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమానికి రైతుబందు, రైతుబీమా పథకలను అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ వచ్చే సారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులుతో పాటు శ్రీకాంత్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్, బాలస్వామి, ఉమామాహేశ్వర్రెడ్డి, జెట్టి నర్సింహ్మరెడ్డి, రాము, కొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కర్జన్రాజు, కర్వు శ్రీను పాల్గన్నారు. -
‘ఆయన్ని మీడియానే హీరో చేసింది’
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిన తరువాత రాజకీయాలు వాడివేడిగా మారిపోయ్యాయి. నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని మీడియానే హీరోగా చిత్రీకరించిందని ఆయన అన్నారు. బాహుబలి.. తదితర టైటిల్స్‌ను ఆయనకు మీడియా తగిలించింది. కానీ ఎందుకు ఆయన తప పదవికి రాజీనామా చేయలేదో అడగలేకపోతుందన్నారు. కొడంగల్‌లో గెలుపుని టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో తన రాజీనామాపై ఆయన వెనుకడుగు వేశారని అన్నారు. కొడంగల్‌లో ఉపఎన్నిక వస్తే టీఆర్ఎస్ 40వేల మెజార్టీతో గెలుస్తుందని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొదటి నుంచి రేవంత్‌ది మోసపూరిత మనస్తత్వమేనని ఆయన అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు మామ్మల్ని కాంగ్రెస్‌కు బేరం పెట్టాలని ప్రయత్నించాడని ఆరోపించారు. రేవంత్ తీరు గమనించిన మేము టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరామని తెలిపారు. 2009లో రేవంత్ గెలుపులో తన పాత్ర ఉందని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆయన తీరును ఇప్పటికే కొడంగల్ ప్రజలు అర్థం చేసుకున్నారని, ఎప్పుడు ఎన్నిక జరిగినా రేవంత్‌ను ఓడిస్తారని జోస్యం చేప్పారు. కాంగ్రెస్‌లో రేవంత్‌కు ఏం పదవిస్తారో మీడియానే చెప్పాలని ఎమ్మెల్యే అడిగారు. -
నిధులివ్వడం లేదు.. పార్టీలో చేరితే ఓకేనట
హైదరాబాద్: తనపై పగతోనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రావాల్సిన నిధులను ఆపి కొత్త ప్రాజెక్టులకు ఇస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీలో చేరితో ఐదు రోజుల్లో అంతా సక్కబెడతామంటూ ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనే నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లభించాయని తెలిపారు. జీవో 68తో రూ.1400 కోట్ల నిధులతో భీమా నుంచి 18 టీఎంసీ నీళ్లు తరలించడం లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు.