హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిన తరువాత రాజకీయాలు వాడివేడిగా మారిపోయ్యాయి. నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని మీడియానే హీరోగా చిత్రీకరించిందని ఆయన అన్నారు. బాహుబలి.. తదితర టైటిల్స్‌ను ఆయనకు మీడియా తగిలించింది. కానీ ఎందుకు ఆయన తప పదవికి రాజీనామా చేయలేదో అడగలేకపోతుందన్నారు. కొడంగల్లో గెలుపుని టీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో తన రాజీనామాపై ఆయన వెనుకడుగు వేశారని అన్నారు. కొడంగల్లో ఉపఎన్నిక వస్తే టీఆర్‌ఎస్ 40వేల మెజార్టీతో గెలుస్తుందని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మొదటి నుంచి రేవంత్‌ది మోసపూరిత మనస్తత్వమేనని ఆయన అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు మామ్మల్ని కాంగ్రెస్‌కు బేరం పెట్టాలని ప్రయత్నించాడని ఆరోపించారు. రేవంత్ తీరు గమనించిన మేము టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరామని తెలిపారు. 2009లో రేవంత్ గెలుపులో తన పాత్ర ఉందని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆయన తీరును ఇప్పటికే కొడంగల్ ప్రజలు అర్థం చేసుకున్నారని, ఎప్పుడు ఎన్నిక జరిగినా రేవంత్‌ను ఓడిస్తారని జోస్యం చేప్పారు. కాంగ్రెస్‌లో రేవంత్కు ఏం పదవిస్తారో మీడియానే చెప్పాలని ఎమ్మెల్యే అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment