
సాక్షి,హైదరాబాద్: గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సోమవారం సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా, తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించారు. రెండో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు హాజరుకాలేదు.
అక్టోబర్ 14 నుంచి బోర్డులకు పూర్తి అధికారం ఇస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలపై గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల 3న మొదటి సమావేశం నిర్వహించగా.. రెండో సమావేశానికి కూడా హాజరుకాబోమని తెలంగాణ లేఖ రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మరొక రోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment