సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. పరవళ్లు తొక్కుతూ కేసరి, పట్టిసీమల నుంచి పది వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. తూర్పు, పశ్చిమ కాల్వలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేయగా, బ్యారేజ్ నాలుగు గేట్లు ఎత్తివేసి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రికి 15వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి విడుదల సామర్థాన్ని అధికారులు అంచలంచెలుగా పెంచనున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల తహశీల్ధార్లతో కలెక్టర్ ఇంతియాజ్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యారేజీకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి
Published Sat, Jul 11 2020 6:56 PM | Last Updated on Sat, Jul 11 2020 7:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment