శ్రీశైలం ప్రాజెక్టు (ఫైల్ ఫోటో)
సాక్షి, కర్నూలు : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతికి కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.40 అడుగులకు చేరింది. 2,17,627 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,14,642 క్కూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను, ప్రస్తుతం నీటి నిల్వ 207 టీఎంసీలకు చేరింది. మరో కొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుతుందని అధికారులు తెలిపారు.
ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బుధవారం అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న సాగర్‌కు నీటి ప్రవాహం చేరుతోంది. అటు గోదావరి పరివాహాక ప్రాంతాల్లోను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాజెక్టులు నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. దీంతో ఖరీఫ్ పంటకు నీటి కొరత ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment