సరళాసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే ఆల
మదనాపురం (కొత్తకోట): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంట అవసరాల కోసం ఎమ్మెల్యే బుధవారం నీరు విడుదల చేశారు. అంతకు ముందు కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు చేయూతనిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యాన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ప్రారంభించారు.
అలాగే మార్కెట్ యార్డు స్థలంలో నిర్మిస్తున్న 160 ఇళ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం మండలంలోని కొన్నూరు, నర్సింగపురం, గోపన్‌పేట గ్రామాలకు చెందిన 14 మంది ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మౌనిక, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యులు వెంకటనారాయణ, జయంతి, రైతు సమన్వ సమితి అధ్యక్షుడు హనుమాన్‌రావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, గోపాలకృష్ణ, రాములు, బాలకృష్ణ, సాయిలుయాదవ్, చాంద్‌పాషా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మహదేవన్‌గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment