Venkateswara Reddy
-
దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం విజేత ఎవరు..!
దేవరకద్ర నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దై దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది దేవరకద్ర నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 34385 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. వెంకటేశ్వరరెడ్డి కి 93358 ఓట్లు రాగా, పవన్ కుమార్ రెడ్డికి 58973 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర సింహులుకు 5300 పైగా ఓట్లు వచ్చాయి. 2009శాసనసభ ఎన్నికలలో దంపతులైన టిడిపి నేతలు దయాకరరెడ్డి, సీత ఇద్దరూ రెండు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తే, 2014లో ఇద్దరూ పరాజితులు అయ్యారు. దేవరకద్రలో సీతా దయాకరరెడ్డి టిడిపి పక్షాన పోటీచేసి రెండోస్థానంలో కూడా ఉండలేకపోయారు. ఇక్కడ2014లో టిఆర్ఎస్ నేత వెంకటేశ్వరరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 14642 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సీత భర్త దయాకరరెడ్డి ఒకసారి మక్తల్ నుంచి రెండుసార్లు అమరచింత నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవరకద్ర, అమరచింత ల నుంచి తొమ్మిది సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా,రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. అమరచింత (2009లో రద్దు) గతంలో ఉన్న అమరచింత నియోజకవర్గం 2009లో రద్దు అయింది. 1962 వరకు ఆత్మకూరు నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో సోంభూపాల్ ఈ రెండుచోట్ల ఇండిపెండెంటుగా గెలిస్తే, 1972లో అమరచింతలో కాంగ్రెస్ పక్షాన ఏకగ్రీవంగా గెలవడం విశేషం. కాంగ్రెస్ ఐ తరుపున కె.వీరారెడ్డి రెండుసార్లు గెలవగా, అమరచింతలో రెండుసార్లు గెలిచిన కె.దయాకరరెడ్డి 2014లో మక్తల్‌లో పోటీ చేసి గెలవడంతో మూడోసార్లు విజయం సాధించినట్లయింది. దేవరకద్ర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం
చెరుకుపల్లి: తన అక్కను వేధించవద్దని చెప్పిన పదో తరగతి విద్యార్థిపై ఓ యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలవారిపాలెంలో శుక్రవారం జరిగింది. బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం... రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలపాలేనికి చెందిన ఉప్పాల మాధవి కుమారుడు ఉప్పాల అమర్నా«థ్ (15) ఉదయం ఐదు గంటల సమయంలో రాజవోలుకు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి అమర్నాథ్ను అడ్డగించి సైకిల్ లాక్కుని రోడ్డు పక్కన మొక్కజొన్న బస్తాలు వేసిన చోటుకు తీసుకువెళ్లి దాడి చేశారు. అనంతరం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్‌ను అమర్నాథ్పై పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయారు. మంటలు రావటంతో సమీపంలోని గ్రామస్తులు గమనించి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలోనూ దాడి.. పదో తరగతి ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతున్న పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ) కొంతకాలంగా అమర్నా«థ్ అక్కను టీజ్ చేస్తున్నాడు. దీంతో వెంకీ, అమర్నాథ్ మధ్య గొడవ జరిగింది. అమర్నా«థ్పై వెంకీ దాడి చేశాడు. ఈ విషయం వెంకీ కుటుంబ సభ్యుల దృష్టికి కూడా అమర్నాథ్ తరఫు పెద్దలు తీసుకెళ్లారు. పాఠశాలలకు సెలవులు రావడంతో వీరు కలవలేదు. తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అమర్నా«థ్, ట్యూషన్, స్కూలుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మార్గంమధ్యలో అమర్నాథ్ను వెంకీ అడ్డగించి బెదిరించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వెంకీ తన స్నేహితులతో కలిసి శుక్రవారం అమర్నాథ్పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. అమర్నాథ్ తండ్రి నాంచారయ్య గతంలోనే మరణించారు. అమర్నాథ్ తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
వైఎస్సార్సీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. కుమారుడితో కలిసి చేరిక
సాక్షి, అమరావతి: సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికీ సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్తెనపల్లి నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచీ యర్రం వెంకటేశ్వరరెడ్డి.. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితులన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఆయన్ను వాడుకుని వదిలేసిందని చెప్పారు. తనను ఓడించాలని కుట్ర పన్ని, కోడెల శివప్రసాద్, చంద్రబాబులతో కుమ్మక్కై అప్పటికప్పుడు నాదెండ్ల మనోహర్ ఆయనకు జనసేన బీఫాం ఇచ్చారన్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరరెడ్డిని జనసేన కార్యక్రమాలకు పిలవకపోగా, అభాసుపాలు చేశారని తెలిపారు. ‘మనోహర్, పవన్, చంద్రబాబులు విడిపోయినట్లు నటించి, మళ్లీ కలిశారు. ఇప్పుడు మళ్లీ బేరాసారాలు చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కోసమేనని ప్రజలు గమనించాలి. వెంకటేశ్వరరెడ్డి, సూరిబాబుల చేరికతో పల్నాడులో వైఎస్సార్సీపీకి మరింత బలాన్నిస్తుందన్నారు. వారికి సరైన గౌరవం, సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వీరి సేవలను అన్ని విధాలా వినియోగించుకుంటామన్నారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు లేదని చెప్పారు. తనకు ఎక్కడి నుంచీ పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతుగా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పేదల సంక్షేమాభివృద్ధి కోసం సీఎం పరితపిస్తుండటం చూసి, తాను వైఎస్సార్సీపీలో చేరానని పక్కాల సూరిబాబు తెలిపారు. చదవండి: త్వరలోనే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా: ముద్రగడ -
యాదాద్రిలో హైకోర్టు జడ్జి పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు జడ్జి వెంకటేశ్వరరెడ్డి, కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వా గతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతి ష్టా అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రథమ ప్రాకారంలో జరిపించిన శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం తదితర పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. జడ్జికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. -
బ్యాంకు మాజీ ఉన్నతాధికారి కృషి.. పైపులైన్ల పంట!
వ్యవసాయంపై ఉన్న మమకారం ఆయనను తిరిగి సొంతూరికి తీసుకొచ్చింది. పదెకరాల నల్లరేగడి భూమిని సాగు చేసుకుంటూ తమ ఊళ్లో విశ్రాంత జీవితం గడుపుదామని ఆయన నిర్ణయించుకొని ఉండకపోతే.. సాగు నీరు లేక అల్లాడుతున్న ఆ ఊరు పొలాల్లో హంద్రీ నీవా కాలువ నీరు జల జలా పారేదే కాదు. రాజకీయాలకు అతీతంగా రైతులను కూడగట్టి పట్టుదలతో ఆయన సాధించిన వరుస విజయాల గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు! ఆయన పేరు సూగూరు వెంకటేశ్వరరెడ్డి. రైతు బిడ్డ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఆయన స్వగ్రామం. వ్యవసాయంలో బీఎస్సీ పట్టా తీసుకున్న ఆయన భారతీయ స్టేట్ బ్యాంక్‌లో వ్యవసాయ క్షేత్ర అధికారిగా ఉద్యోగంలో చేరారు. 35 ఏళ్ల తర్వాత 2018లో ఏజీఎంగా ఉద్యోగ విరమణ చేసి.. సొంతూళ్లో సేద్యం చేస్తూ వ్యవసాయానికి జవసత్వాలు చేకూర్చుతున్నారు. ? ఉమ్మడిగా భూగర్భ పైపులైన్లు మల్లెపల్లి గ్రామానికి 2.5 కి. మీ. దూరం నుంచి హంద్రీ నీవా – సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువ వెళ్తుంది. వర్షాలు కురిస్తే కాలువలో ఏడాది పొడవుగా నీళ్లు పారుతుంటాయి. కానీ, గ్రామ పొలాలకు ఈ నీరు పారదు. వెంకటేశ్వరరెడ్డి పైపులైను గురించి ఆలోచించారు. గ్రామ రాజకీయాలను, రైతుల్లో అనైక్యతను అధిగమించి 30 మంది రైతులను ఏకం చేశారు. భూగర్భ పైపులైను నిర్మించి డీజిల్ పంపుల ద్వారా కాలువ నీటిని పొలాల్లో పారించారు. మీటరు లోతులో, 5–6 అడుగుల వెడల్పున ఉమ్మడిగా కందకం తవ్వి.. రైతులు ఎవరికి వారు తమ పీవీసీ పైపులను ఈ కందకంలో పక్క పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి డీజిల్ ఇంజన్లను వాళ్లే ఏర్పాటు చేసుకొని, ఎవరికి కావాల్సినప్పుడు నీటిని వారు తోడుకుంటున్నారు. ఫామ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసుకొని డ్రిప్‌లో, స్ప్రింక్లర్ల ద్వారా పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ స్కీము అమలయ్యేనా? అన్న అనుమానంతో తొలుత ఏ ఇతర రైతులూ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. వెంకటేశ్వరరెడ్డి పట్టుదలతో తనే రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, పైపులైను నిర్మించి నీటిని పొలాలకు పారించారు. సొంత పూచీకత్తుపై ప్రతి రైతు పేరిట రూ. లక్ష బ్యాంకు రుణం ఏర్పాటు చేయించి.. తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము 4 నెలల తర్వాత తిరిగి తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆ విధంగా తమ గ్రామ పొలాల్లో ఆరుతడి పంటలకు రక్షక తడులు ఇవ్వడానికి నీటి భద్రత చేకూరిందని వెంకటేశ్వరరెడ్డి సంబరంగా చెబుతుంటారు. ఆ తర్వాత గ్రామంలో ఇతర రైతులు కూడా అనుసరించారు. సుమారు వంద మంది రైతులు దశల వారీగా మరో 8 భూగర్భ పైపులైన్ స్కీముల ద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత కల్పించుకున్నారని ఆయన తెలిపారు. వెంకటేశ్వరరెడ్డి పాడి గేదెల ఫారం ఎకరానికి రూ. 5–6 వేల ఖర్చు రేగడి నేలలు కావటాన మూడు నాలుగు వారాలు వర్షం మొహం చాటేసినప్పుడు పంటలను రైతులు కాలువ నీటితో రక్షక తడులు అందించి రక్షించుకుంటున్నారు. ఖరీఫ్ కాలంలో వర్షాభావ పరిస్థితులను బట్టి 1–2 సార్లు, రబీలో 2–3 సార్లు నీటిని సొంత ఖర్చుతో తోడుకుంటున్నారు. ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 5–6 వేల వరకు డీజిల్ ఖర్చవుతున్నదని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కొందరు రైతులు వేసవిలో కూరగాయలను సైతం మూడో పంటగా సాగు చేసుకొని మంచి ఆదాయం గడిస్తున్నారు. నీటి భద్రత వల్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. పత్తి, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. భూమి విలువ పెరగడంతో పాటు కౌళ్లు రెట్టింపయ్యాయి. 25 ఎకరాల దేవాలయ భూములకు పైపులైను ద్వారా కాలువ నీటిని తెప్పించేందుకు సొంత డబ్బు రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మల్లెపల్లె ప్రాథమిక పాఠశాల, అల్లుగుండు ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ట్యాంకులు విరాళంగా ఇచ్చారు. సంఘటితమైతే రైతులకు మేలు జరుగుతుందని నమ్మే వెంకటేశ్వరరెడ్డి ‘నాగలి రైతు ఉత్పత్తిదారుల సంఘం’ను ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరెడ్డి. ప్రస్తుతం ఇందులో 40 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు వెంకటేశ్వరరెడ్డి రుణం తీర్చుకోవటం కోసమే ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు! పైపులైన్ నీటితో సాగవుతున్న వేరుశనగ రాజకీయాలకు అతీతంగా కృషి దేశానికి అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉండాలనేది నా లక్ష్యం. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని రైతులను రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై తెచ్చాం. హంద్రీ నీవా కాలువ నీటిని అందించే పైపులైను స్కీమును అమలు చేశాం. ఎంతో కష్టపడ్డాం. ఒకప్పడు ఏటా ఒక పంట పండటమే కష్టంగా ఉంది. నేడు అనేక మంది 2 పంటలు సాగు చేస్తున్నారు. కొందరు మూడు పంటలు కూడా వేసుకుంటున్నారు. తర్వాత మరో 8 పైపులైను స్కీములు ఏర్పాటయ్యాయి. తద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత చేకూరింది. రాజకీయాలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో బాధ్యత పెరిగింది. – సూగూరు వెంకటేశ్వరరెడ్డి (98660 09889), మాజీ బ్యాంకు ఉన్నతాధికారి, రైతు, సర్పంచ్, మల్లెపల్లి, కర్నూలు జిల్లా -
ఔను... వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు
సాక్షి, మధిర: గతంలో ఉప్పు, నిప్పుగా ఉండే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒకే పార్టీలో ఉన్నారు. ఎర్రుపాలెం మండలానికి చెందిన భద్రాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. గతంలో అయిలూరి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడుకానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడుకానీ ప్రత్యర్థి వర్గంగా టీడీపీకి చెందిన చావా రామకృష్ణ ఉన్నారు. ఆ మండలం లో ఈ రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదా లు, పార్టీల విభేదాలు ఉండేవి. ప్రతీ గ్రామంలో వారిరువురికీ అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల వర్గీయునిగా కొనసాగుతున్న చావా రామకృష్ణ, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరునిగా ఉన్న అయిలూరి వెంకటేశ్వరరెడ్డి వేర్వేరు సందర్భాల్లో టీఆర్ఎస్ చేరారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి చొరవతో ఆ ఇద్దరు నాయకులు ఎర్రుపాలెం మం డలంలో టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో ప్రత్యర్థివర్గాలుగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉండి కమల్‌రాజ్ గెలుపుకోసం ఒకే వాహనంలో తిరుగుతూ ప్రచారం చేయడం గమనార్హం. మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేకత ఉంది. ఆ మండలంలో ఏ అభ్యర్థికి మెజార్టీ వస్తుందో ఆ అభ్యర్థే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సం దర్భాలు ఉన్నాయి. దీంతో అయిలూరి వెంకటేశ్వ రరెడ్డి, చావా రామకృష్ణ కమల్‌రాజ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికే చావా రామకృష్ణకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అప్పగించగా రాబోయే ప్రభుత్వంలో అయిలూరికి సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి హామీ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం మధిరలో కమల్‌రాజ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారిద్దరూ కోర్టు ఆవరణలో ఉన్న వేపచెట్టుకింద కూర్చొని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించు కోవడం గమనార్హం వారిద్దరి కలయికను ఆప్రాంతంలో ఉన్న వారు ఆసక్తిగా తిలకించారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనాపురం (కొత్తకోట): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంట అవసరాల కోసం ఎమ్మెల్యే బుధవారం నీరు విడుదల చేశారు. అంతకు ముందు కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు చేయూతనిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యాన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే మార్కెట్ యార్డు స్థలంలో నిర్మిస్తున్న 160 ఇళ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం మండలంలోని కొన్నూరు, నర్సింగపురం, గోపన్‌పేట గ్రామాలకు చెందిన 14 మంది ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మౌనిక, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యులు వెంకటనారాయణ, జయంతి, రైతు సమన్వ సమితి అధ్యక్షుడు హనుమాన్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, గోపాలకృష్ణ, రాములు, బాలకృష్ణ, సాయిలుయాదవ్, చాంద్‌పాషా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మహదేవన్‌గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్న, వదినలను చంపేశాడు
రెంటచింతల: గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. తోడబుట్టిన అన్న అని చూడకుండా గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే రెంటచింతల మండలంలో జెట్టిపాలెంలో వెంకటేశ్వరరెడ్డి, అతని సోదరుడుకి గత కొంతకాలంగా భూవివాదాలు నడుస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈగొడవలు తీవ్రమయ్యాయి. శుక్రవారం వీరిఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఆవేశంలో తమ్ముడు, వెంటేశ్వరరెడ్డిని అతని భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్య
వర్ని: ఆర్థిక ఇబ్బందులతో మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి(36) ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర్ రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా చర్లోపల్లి గ్రామం. రెండు నెలల క్రితం నుంచి కోటగిరి మండలం పొతంగల్ ప్రాంతంలో మిషన్ భగీరథ పనులు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నాం లాడ్జీకి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైకోర్టు రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వరరెడ్డి
రంగారెడ్డి జిల్లా జడ్జిగా రేణుక సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా ఎ.వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా ఉన్న షమీమ్ అక్తర్ పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. వెంకటేశ్వరరెడ్డిని రిజిస్ట్రార్‌గా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేశ్వరరెడ్డి నియామకంతో ఖాళీ అయిన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి స్థానాన్ని వై.రేణుకతో భర్తీ చేశారు. ప్రస్తుతం ఆమె కరీంనగర్ ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మొదటి అదనపు చీఫ్ జడ్జిగా పనిచేస్తున్న ఎ.వి.పార్థసారథి ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. -
బంగారు పతకాల తెలంగాణ కావాలి
‘శాట్స్’ చైర్మన్ ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: దేశంలో తెలంగాణను క్రీడల్లో నంబర్ 1గా తీర్చిదిద్దేలా కృషిచేయాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి క్రీడాసంఘాలకు పిలుపునిచ్చారు. బంగారు పతకాల తెలంగాణ అయ్యే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని క్రీడాసంఘాల అధికారులతో ఆయన గురువారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సంఘాలకు రావాల్సిన నిధులు, మౌలిక వసతులు, సదుపాయాల గురించి ఆయన అధికారులతో చర్చించారు. త్వరలోనే క్రీడా సంఘాల సమస్యల్ని పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. వీటితో పాటు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం సలహాలను, భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అన్ని సంఘాలు కలిసి కట్టుగా కృషిచేస్తేనే రాష్ట్రంలో క్రీడాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. క్రీడా సంఘాల ఉమ్మడి లక్ష్యం తెలంగాణను క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచేలా పనిచేయడమే కావాలని ఆయన కోరారు. శాట్స్ ఎండీ క్రిస్టినా చొంగ్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాల అధికారులు, సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర రెడ్డి
శాట్స్ చైర్మన్‌గా నియామకం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, శాట్స్ అధికారులు, క్రీడాభిమానులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర రెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. గ్రామాల్లోని యువత క్రీడల్లో రాణించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పంజాబ్, హరియాణా తరహాలో రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో క్రీడాకారుల కోసం హాస్టల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, పద్మారావు గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బాల్క సుమన్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, గువ్వల బాలరాజు, ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీలు కాశిరెడ్డి నారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు శాట్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
వినాయక నిమజ్జనానికి వెళ్లి వచ్చేసరికి..
గుంటూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి... గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపును చూసేందుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 70 సవర్ల బంగారంతోపాటు రూ. 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంకటేశ్వరరెడ్డి కుటుంబసభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం'
కర్నూలు: తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం అంటే ఈ రోజుతో ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిరువురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అధికార తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి నిలపలేదు. అదికాక స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కూడా తమ నామినేషన్ ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అభ్యర్థి, భూమా శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. -
మా అదృష్టం ఇంతేనేమో..
బియాస్ నది వద్ద నుంచి తిరిగొచ్చిన వెంకటేశ్వరరెడ్డి బోధన్ టౌన్ : ‘‘జరిగిన దానికి ఎవరినీ నిందించ ను. మా అదృష్టం ఇంతే అనుకుంటా’’ అంటూ వేదన నిండిన హృదయంతో విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నా రు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థు ల్లో జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. సమాచారం తెలియగానే ఆయన తండ్రి వెంకటేశ్వరరెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. శుక్రవారం వరకు విష్ణు ఆచూకీ తెలియలేదు. వెంకటేశ్వరరెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి శుక్రవారం స్వగ్రామం బోధన్‌కు తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న బంధువుల వారి ఇంటికి వచ్చి ఓదార్చారు. గల్లంతైన విద్యార్థులు తమ పిల్లలే అన్నట్లుగా రెస్క్యూ టీం గాలింపు చర్యలు నిర్వహిస్తోందని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణం గా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. భార్య రమాదేవి, కూతురు అనూష ఎలా ఉన్నారో అన్న ఆందోళనతో వచ్చానని, రెండు రోజులుండి మళ్లీ సంఘటన స్థలానికి వెళ్తానని పేర్కొన్నారు. కొవ్వత్తులతో నివాళి బోధన్ టౌన్ : ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన్‌కు చెందిన ప్రజాసేవ యువసేన సభ్యులు నివాళులు అర్పించారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు వేములపల్లి బుజ్జి మాట్లాడుతూ పర్యాటక స్థలాల్లో సూచిక బోర్డులు, ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో యువసేన సభ్యులు ప్రకాశ్, రమణ, బాపురెడ్డి, అనిల్, ప్రసాద్, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
దుఃఖాన్ని దిగమింగి..
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన జిల్లాకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి ఆచూకీ నాలుగు రోజులు గడిచినా లభించలేదు. దీంతో ఆయన తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి నిరాశతో స్వగ్రామానికి పయనమయ్యారు. బోధన్ : నాలుగు రోజుల నిరీక్షణ ఫలించలేదు. బియాస్ నదిలో గల్లంతైన కుమారుడి ఆచూకీ లభించలేదు. నిరాశతో ఆ తండ్రి సంఘటన స్థలంనుంచి వెనుదిరిగారు. పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని స్వగ్రామానికి పయనమయ్యారు. హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి తోటి విద్యార్థులతో ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. విష్ణు బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతానికి చెందినవారు. కుమారుడి ఆచూకీ కోసం తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడే ఉండి ఆచూకీ లభిస్తుందేమోనని వేచి చూశారు. వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీనివాస్‌రెడ్డి, ఆయన స్నేహితుడు రాజశేఖర్ మాత్రం అక్కడే ఉన్నారు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి, సోదరి బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతంలోని స్వగృహంలో ఉన్న విష్ణు తల్లి రమాదేవి, సోదరి అనుష, అమ్మమ్మ కోటమ్మ, నానమ్మ ఆదిలక్ష్మి, ఇతర బంధువులు అతడి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నారు. వివరాలు తెలియకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంధువులు, స్నేహితులు వారిని ఓదారుస్తున్నారు.