దేవరకద్ర నియోజకవర్గం
2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దై దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది
దేవరకద్ర నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 34385 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. వెంకటేశ్వరరెడ్డి కి 93358 ఓట్లు రాగా, పవన్ కుమార్ రెడ్డికి 58973 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర సింహులుకు 5300 పైగా ఓట్లు వచ్చాయి. 2009శాసనసభ ఎన్నికలలో దంపతులైన టిడిపి నేతలు దయాకరరెడ్డి, సీత ఇద్దరూ రెండు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తే, 2014లో ఇద్దరూ పరాజితులు అయ్యారు.
దేవరకద్రలో సీతా దయాకరరెడ్డి టిడిపి పక్షాన పోటీచేసి రెండోస్థానంలో కూడా ఉండలేకపోయారు. ఇక్కడ2014లో టిఆర్‌ఎస్ నేత వెంకటేశ్వరరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 14642 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సీత భర్త దయాకరరెడ్డి ఒకసారి మక్తల్ నుంచి రెండుసార్లు అమరచింత నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవరకద్ర, అమరచింత ల నుంచి తొమ్మిది సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా,రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు.
అమరచింత (2009లో రద్దు)
గతంలో ఉన్న అమరచింత నియోజకవర్గం 2009లో రద్దు అయింది. 1962 వరకు ఆత్మకూరు నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో సోంభూపాల్ ఈ రెండుచోట్ల ఇండిపెండెంటుగా గెలిస్తే, 1972లో అమరచింతలో కాంగ్రెస్ పక్షాన ఏకగ్రీవంగా గెలవడం విశేషం. కాంగ్రెస్ ఐ తరుపున కె.వీరారెడ్డి రెండుసార్లు గెలవగా, అమరచింతలో రెండుసార్లు గెలిచిన కె.దయాకరరెడ్డి 2014లో మక్తల్‌లో పోటీ చేసి గెలవడంతో మూడోసార్లు విజయం సాధించినట్లయింది.
దేవరకద్ర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment