హైకోర్టు రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వరరెడ్డి | Venkateswara Reddy as the High Court Judicial | Sakshi
Sakshi News home page

హైకోర్టు రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వరరెడ్డి

Published Tue, Feb 28 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

Venkateswara Reddy as the High Court Judicial

రంగారెడ్డి జిల్లా జడ్జిగా రేణుక

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)గా ఎ.వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్‌ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)గా ఉన్న షమీమ్‌ అక్తర్‌ పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది.  వెంకటేశ్వరరెడ్డిని రిజిస్ట్రార్‌గా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వెంకటేశ్వరరెడ్డి నియామకంతో ఖాళీ అయిన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్‌ జడ్జి స్థానాన్ని వై.రేణుకతో భర్తీ చేశారు. ప్రస్తుతం ఆమె కరీంనగర్‌ ప్రిన్సిపల్, సెషన్స్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె స్థానంలో హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు మొదటి అదనపు చీఫ్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎ.వి.పార్థసారథి ప్రిన్సిపల్, సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement