గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి.
రెంటచింతల: గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. తోడబుట్టిన అన్న అని చూడకుండా గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే రెంటచింతల మండలంలో జెట్టిపాలెంలో వెంకటేశ్వరరెడ్డి, అతని సోదరుడుకి గత కొంతకాలంగా భూవివాదాలు నడుస్తున్నాయి.
అయితే గత కొంత కాలంగా ఈగొడవలు తీవ్రమయ్యాయి. శుక్రవారం వీరిఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఆవేశంలో తమ్ముడు, వెంటేశ్వరరెడ్డిని అతని భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.