Rentachintala
-
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్‌రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.ఉమామహేశ్వర్‌రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లిటీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దౌర్జన్యాలు, అల్లర్లతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. మూడు రోజుల క్రితం నా భార్యపైనా దాడి చేశారు.ఇవాళ రెంటచింతలలో మా నాయకులపై హత్యాయత్నం చేశారని పిన్నెల్లి మండిపడ్డారు. -
వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఇలా.. ఏప్రిల్ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. -
అన్న, వదినలను చంపేశాడు
రెంటచింతల: గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. తోడబుట్టిన అన్న అని చూడకుండా గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే రెంటచింతల మండలంలో జెట్టిపాలెంలో వెంకటేశ్వరరెడ్డి, అతని సోదరుడుకి గత కొంతకాలంగా భూవివాదాలు నడుస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈగొడవలు తీవ్రమయ్యాయి. శుక్రవారం వీరిఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఆవేశంలో తమ్ముడు, వెంటేశ్వరరెడ్డిని అతని భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పతాగి ప్రభుత్వ ఉపాధ్యాయుడి వీరంగం..
రెంటచింతల (గుంటూరు) : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తప్ప తాగి పాఠశాలలో వీరంగం సృష్టించాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. పాఠశాలలో ఉన్న లోపాలు ఎవరికి కనిపించడం లేదా అంటూ వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్ముడుకోట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న కేకేడీ ప్రసాద్ మద్యం మత్తులో లుంగీపై పాఠశాలకు వెళ్లాడు. ఏకోపాధ్యాయుడు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులు అంతా ఆడుకుంటుండగా.. ఉపాధ్యాయుడు మాత్రం రోడ్డు పక్కన చైర్ వేసుకుని కూర్చున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులతో పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అందుకే ఇక్కడ గాలి బాగా వీస్తోందని కూర్చున్నానంటూ సమాధానం ఇచ్చాడు. మద్యం మత్తులో ఉపాధ్యాయుడు లుంగీపైనే పాఠశాలకు హాజరయ్యాడని గుర్తించి ఎమ్ఈవోకు సమాచారం అందించారు. కాగా.. గతంలో కూడా ఉపాధ్యాయుడి తీరు సరిగ్గా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2012 సంవత్సరంలో నిధుల దుర్వినియోగం పై అధికారులు సస్పెన్షన్ విధించినా తీరు మార్చుకోలేదని వాపోతున్నారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
రెంటచింతల: అధికార పార్టీలో లుకలుకలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో టీడీపీకి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ తెనాలి వెంకటనారపురెడ్డిపై అదే గ్రామానికి చెందిన గోగుల వర్గానికి చెందిన వారు సోమవారం దాడి చేశారు. గ్రామ సెంటర్ నుంచి నడిచి వస్తున్న వెంకటనారపురెడ్డిపై కర్రలతో దాడి చేయడంతో.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆయన అనుచరుడైన శ్రీనివాస్ రెడ్డి పొలం వద్ద ఉన్నాడని తెలుసుకున్న వాళ్లు అక్కడికి చేరుకొని అతని పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. -
మంచినీరు అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి
రెంటచింతల (గుంటూరు) : మంచినీరు అనుకుని ఓ చిన్నారి పురుగు మందు తాగి మృత్యువాతపడింది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపాడులో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్మన్నాయక్, రోజా బాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. సోమవారం సాయంత్రం పొలానికి వెళ్తూ తమ చిన్నారి సంధ్య(ఏడాదిన్నర)ను వెంట తీసుకెళ్లారు. పొలం గట్టున చిన్నారిని నిద్రపుచ్చిన ఆ దంపతులు పురుగు మందు పిచికారీ చేయటంలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన చిన్నారి... దాహం వేయటంలో పక్కనే ఉన్న పురుగు మందును మంచినీళ్లుగా భావించి తాగింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే సంధ్య చనిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పల్నాడు కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
-
పల్నాడు కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
గుంటూరు : గుంటూరు జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెంటచింతలలోని పల్నాడు కోల్డ్ స్టోరేజ్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉన్న 55వేల మిర్చి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మిర్చి ఘాటుకు పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
పోలియో బాధిత చిన్నారి బావిలో తోసివేత
రెంటచింతల: రెండు కాళ్లకు పోలియో సోకిన చిన్నారి(3)ని భారంగా భావించిన తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా బావిలో పడేసి పారిపోయారు.ఈ సంఘటన గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం చోటుచేసుకుంది. నేలబావి సమీపంలో నారుమడికి నీరుపెట్టేందుకు వెళ్లిన రైతు పాత పుల్లారావుకు బావిలో నుంచి పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆయన వెళ్లి బావిలోకి జారిన మర్రి ఊడలను పట్టుకొని వేలాడుతున్న పాపను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పాపకు స్థానిక వైద్యుడు మధుబాబు వద్ద వైద్య పరీక్షలు చేయించి, ఆయన పర్యవేక్షణలో ఉంచారు. పాప వివరాలు తెలిసినవారు సీఐ నం:9440796228, ఎస్ఐ నం: 9440900883, స్టేషన్ నం: 08642258433లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రెంటచింతల, న్యూస్‌లైన్ : రెంటచింతల పెద్దకాలువ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ వెంకట సురేష్ కథనం ప్రకారం.. గురజాలకు చెందిన మాచర్ల సైదులు తన స్నేహితుడితో కలసి రెంటచింతల నుంచి ద్విచక్రవాహనంపై తన గ్రామానికి వెళుతున్నారు. అదేసమయంలో రెంటచింతలకు లిక్కర్ లోడ్‌తో వస్తున్న లారీని పెద్దకాలువ సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సైదులు అక్కడికక్కడే మృతిచెందాడు. వెనక కూర్చున్న అతని స్నేహితుడు బొల్లా రామారావు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనం వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడిని వ్యక్తిని 108లో గురజాల ఆసత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో సైదులు తల పూర్తిగా తెగి మొండేనికి 50 అడుగుల దూరంలో పడింది. కుడి కాలు విరిగింది. సైదులు గురజాల తహశీల్దార్ కార్యాలయం సమీపంలో బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.