సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్‌రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.
ఉమామహేశ్వర్‌రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లి
టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దౌర్జన్యాలు, అల్లర్లతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. మూడు రోజుల క్రితం నా భార్యపైనా దాడి చేశారు.ఇవాళ రెంటచింతలలో మా నాయకులపై హత్యాయత్నం చేశారని పిన్నెల్లి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment