
పోలియో బాధిత చిన్నారి బావిలో తోసివేత
రెంటచింతల: రెండు కాళ్లకు పోలియో సోకిన చిన్నారి(3)ని భారంగా భావించిన తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా బావిలో పడేసి పారిపోయారు.ఈ సంఘటన గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం చోటుచేసుకుంది. నేలబావి సమీపంలో నారుమడికి నీరుపెట్టేందుకు వెళ్లిన రైతు పాత పుల్లారావుకు బావిలో నుంచి పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆయన వెళ్లి బావిలోకి జారిన మర్రి ఊడలను పట్టుకొని వేలాడుతున్న పాపను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పాపకు స్థానిక వైద్యుడు మధుబాబు వద్ద వైద్య పరీక్షలు చేయించి, ఆయన పర్యవేక్షణలో ఉంచారు.
పాప వివరాలు తెలిసినవారు సీఐ నం:9440796228, ఎస్‌ఐ నం: 9440900883, స్టేషన్ నం: 08642258433లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు.