మా అదృష్టం ఇంతేనేమో..
బియాస్ నది వద్ద నుంచి తిరిగొచ్చిన వెంకటేశ్వరరెడ్డి
బోధన్ టౌన్ : ‘‘జరిగిన దానికి ఎవరినీ నిందించ ను. మా అదృష్టం ఇంతే అనుకుంటా’’ అంటూ వేదన నిండిన హృదయంతో విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నా రు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థు ల్లో జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. సమాచారం తెలియగానే ఆయన తండ్రి వెంకటేశ్వరరెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు.
శుక్రవారం వరకు విష్ణు ఆచూకీ తెలియలేదు. వెంకటేశ్వరరెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి శుక్రవారం స్వగ్రామం బోధన్‌కు తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న బంధువుల వారి ఇంటికి వచ్చి ఓదార్చారు. గల్లంతైన విద్యార్థులు తమ పిల్లలే అన్నట్లుగా రెస్క్యూ టీం గాలింపు చర్యలు నిర్వహిస్తోందని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణం గా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. భార్య రమాదేవి, కూతురు అనూష ఎలా ఉన్నారో అన్న ఆందోళనతో వచ్చానని, రెండు రోజులుండి మళ్లీ సంఘటన స్థలానికి వెళ్తానని పేర్కొన్నారు.
కొవ్వత్తులతో నివాళి
బోధన్ టౌన్ : ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన్‌కు చెందిన ప్రజాసేవ యువసేన సభ్యులు నివాళులు అర్పించారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు వేములపల్లి బుజ్జి మాట్లాడుతూ పర్యాటక స్థలాల్లో సూచిక బోర్డులు, ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో యువసేన సభ్యులు ప్రకాశ్, రమణ, బాపురెడ్డి, అనిల్, ప్రసాద్, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.