India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు.
చదవండి: హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్‌సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు.
కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment